భూపతి రెడ్డికి కార్పొరేషన్ పదవి ?
● పదవులు దక్కని సీనియర్ల
ఎదురుచూపులు
● మున్సిపల్ ఎన్నికల తర్వాత నియామకాలు చేయనున్నట్లు చర్చ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో నామినేటెడ్ పదవులను పూర్తిస్థాయిలో భర్తీ చేయ లేదు. దీంతో సీనియర్ నాయకులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ఎమ్మెల్యేలకు సైతం కీలకమైన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవు లు కేటాయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి కీలకమైన రాష్ట్ర కార్పొరేషన్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా పనిచేశారు. కాగా ఇప్ప టి వరకు ప్రభుత్వ విప్ పదవిని ఆశిస్తూ వచ్చిన భూపతిరెడ్డికి తాజాగా కార్పొరేషన్ పదవి కేటాయించనున్నట్లు తెలియడంతో పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డికి కీలక పదవి కేటాయించారు. భూపతిరెడ్డికి సైతం ప దవి దక్కితే పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
● జుక్కల్ ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించి భంగపడిన గడుగు గంగాధర్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. తనకు వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా పదవి ఇవ్వడంపై గడుగు అసంతృప్తిగా ఉన్నారు. 1983 నుంచి ఆయన పార్టీకి సేవలందిస్తున్నారు.
● ఎనిమిది నెలల కిందట రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పదవులు దక్కని సీనియర్ల వివరాలు సేకరించారు. నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నవారు, డీసీసీ అధ్యక్ష పీఠం కోసం, బ్లాక్, మండల అధ్యక్ష పదవుల కోసం పోటీ పడుతున్న నాయకుల పేర్లను మీనాక్షి తీసుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎక్కువ అవకాశాలు కల్పించేందుకు గాను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కసరత్తు చేశారు. మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పకడ్బందీగా చేసే లక్ష్యంతో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అయినప్పటికీ తమకు నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు కేటాయించడంలో ఆలస్యం చేస్తుండడంపై పార్టీలో నిరాశ వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోగా నామినేటెడ్, పార్టీ పదవుల కోసం సీనియర్ నాయకులు ఎదురు చూస్తున్నారు. తమకంటే జూనియర్లకు కీలకమైన పదవులు దక్కాయంటూ గుర్రుగా ఉన్నారు. మనస్తాపం చెందుతున్నారు. 1988 నుంచి పార్టీకి సేవలందిస్తున్న మార చంద్రమోహన్‌రెడ్డి తాజాగా డీసీసీ పీఠం ఆశించి విఫలమయ్యారు. చంద్రమోహన్‌రెడ్డి నామినేటెడ్ రేసులో ఉన్నారు. మరో సీనియర్ నాయకుడు బాడ్సి శేఖర్‌గౌడ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. 1983 నుంచి శేఖర్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారు. శేఖర్‌గౌడ్‌కు రాష్ట్ర కార్పొరేషన్ పదవి వచ్చినట్లేనని అంటున్నప్పటికీ ఎప్పటికప్పుడు పెండింగ్ పడుతోంది. డీసీసీ పీఠం కోసం గట్టి ప్రయత్నాలు చేసిన బాస వేణుగోపాల్ యాదవ్ సైతం కీలకమైన పదవిని ఆశిస్తున్నారు.


