వరద కాలువకు జలకళ
మోర్తాడ్(బాల్కొండ): వరద కాలువను ఆనుకుని ఉన్న భూములకు సాగునీరందించేందుకు ప్రభు త్వం చొరవ చూపింది. రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నీటిని వరద కాలువలో నింపడంతో యాసంగి పంటలకు నీటి కొరత తీరనుంది. వరద కాలువ ద్వారా నీటి విడుదల లేకపోయినప్పటికీ నీటిని నిలువ ఉంచడం ద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెందడం, కాలువను ఆనుకుని ఉన్న భూములకు సాగునీటి సౌకర్యం లభించేది. వర్షాకాలంలో గాండ్లపేట్ వద్ద వరద కాలువకు గండిపడటంతో నీరు లీకై కాలువ ఖాళీ అయ్యింది. వర్షాకాలం పంటలకు ఎలాంటి సమస్య లేకపోయినా యాసంగి పంటలకు మాత్రం వరద కాలువలో నీరు నిలువ లే కపోతే ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆందోళన చెందారు. మోర్తాడ్, తిమ్మాపూర్, పాలెం, గాండ్లపేట్, కమ్మర్‌పల్లి, ఉప్లూర్, నాగాపూర్ గ్రామాలకు చెందిన రైతులు సుమారు 2,600 ఎకరాలు వరద కాలువపైనే ఆధారపడి ఉన్నాయి. గండికి మరమ్మతులు పూర్తి చేసేందుకు మరింత సమయం ఉండటంతో గండి ఏర్పడిన ప్రాంతానికి దూరంలో నీటిని నిలువ ఉంచితే తమకు ఇబ్బందులు తప్పుతాయని రైతులు భావించారు. ఈ మేర కు ఏడు గ్రామాల రైతులు ఇటీవల బాల్కొండ ని యోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులతో మాట్లాడా రు. నీటి విడుదలకు ఆమోదం తెలుపడంతో రైతులకు నీటి చింత తీరింది. ఈనెల 8వ తేదీన నీటిని రివర్స్ పంప్ చేయగా మరుసటి రోజు వరకు వరద కాలువలో నీరు నిండింది. రెండు మీటర్ల లోతులో నీరు నిలువ ఉండటంతో యాసంగి పంటలకు ఎ లాంటి ఇబ్బంది ఉండదని రైతులు పేర్కొంటున్నా రు. కమ్మర్‌పల్లి మండలం నాగాపూర్ నుంచి మోర్తా డ్ మండలం గాండ్లపేట్ వరకు నీరు నిల్వ ఉంది.
రాంపూర్ పంప్‌హౌజ్ వద్ద సాంకేతిక సమస్య
కాళేశ్వరం నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా మోర్తాడ్ వరకు పంపించేందుకు నీటిపారుదల శాఖ మంత్రి, అధికార యంత్రాంగం అంగీకరించినా వరద కాలువ 70వ కిలోమీటర్ వద్ద ఉన్న రాంపూర్ పంప్‌హౌజ్‌లో సాంకేతిక సమస్య నెలకొంది. అక్కడి విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి దొంగలు విద్యుత్ తీగలను ఎత్తుకెళ్లారు. దీంతో నీటి విడుదలకు ప్రభుత్వం అంగీకరించినా సాంకేతికంగా సాధ్యపడలేదు. ఎన్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులతో మరోసారి సంప్రదింపులు జరపడంతో సబ్‌స్టేషన్ నుంచి పంప్‌హౌజ్‌కు విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. దీంతో నీరు గాండ్లపేట్ వరకు చేరింది.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
వరద కాలువలోకి నీటిని విడుదల చేయాలని రైతులు కోరడం, ప్రభుత్వం స్పందించడంతో పెద్ద సమస్య తీరిపోయింది. గండిపడిన చోట మరమ్మతులకు కొంత సమయం ఉండటంతో కట్టలు కట్టిన వరకై నా నీటిని నిలువ ఉంచాలని కోరాం. ప్రభుత్వం స్పందించినందుకు రైతులు రుణపడి ఉంటారు.
– రొక్కం మురళి, సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్, తిమ్మాపూర్
రివర్స్ పంపింగ్‌తో కాలువలోకి చేరిన కాళేశ్వరం నీరు
గాండ్లపేట్ శివారులోని కాలువలో
గండి వద్ద మట్టికట్ట ఏర్పాటు
నీటిని నిలువ ఉంచి యాసంగి
పంటలను గట్టెక్కించేందుకు చొరవ
వరద కాలువకు జలకళ


