బల్దియా పోరుకు మరో అడుగు
● సామాజికవర్గాల వారీగా రిజర్వ్ అయ్యే స్థానాల సంఖ్యపై స్పష్టత
మోర్తాడ్(బాల్కొండ): మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో మరో అడుగు ముందు పడింది. జిల్లాలో ని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపా టు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల పరిధిలో ఏ సామాజికవర్గానికి ఎన్ని సీట్లు రిజర్వ్ అవుతాయనేదానిపై స్పష్టత వచ్చింది. ఈ మేర కు బుధవారం రాత్రి ప్రభుత్వం రిజర్వేషన్‌లు ఖరారు చేసింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్‌లు ఉండగా ఎస్టీ వర్గానికి ఒకే ఒక్క స్థానం.. 16 డివిజన్‌లు జనరల్ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులు, ఆర్మూర్‌లో 36, భీమ్‌గల్‌లో 12 వార్డు స్థానాలున్నాయి.


