‘సాగర్’కు చేరిన సింగూరు జలాలు
● ప్రధాన కాలువకు
కొనసాగుతున్న నీటి విడుదల
నిజాంసాగర్: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా ఈనెల 10 నుంచి విడుదలవుతున్న నీరు బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టును చేరింది. ప్రాజెక్టులోకి 4,380 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. ఆయకట్టు అవసరాల కోసం ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 700 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి 1,402 అడుగుల (14.830 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు.
కార్పొరేషన్‌లో
అఖిలపక్ష సమావేశం
● ఓటరు జాబితాలో
తప్పులున్నాయని అభ్యంతరాలు
నిజామాబాద్ రూరల్: మున్సిపల్ ఎన్నికల కసరత్తులో భాగంగా నగరంలోని మున్సిప ల్ కార్యాలయంలో కమిషనర్‌ఽ దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆయా రాజకీయ పార్టీ ల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఓటరు జాబితాలో తప్పులున్నా యని తాము కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి సాధ్యమైనంత వరకు సరి చే స్తామని కమిషనర్ అన్నారని నాయకులు తె లిపారు. తాము పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఓటరు జాబితాను సరిచేయాలని కోరామన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల సంఖ్య దాదాపు 50 వరకు పెరిగిందని తెలిపారు.
ఆరోగ్య ఉపకేంద్రం తనిఖీ
వేల్పూర్: వేల్పూర్ మండలం జాన్కంపేట్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరును పరిశీలించారు. ప్రతి బుధవారం జరిగే వ్యాధి నిరోధ టీకాల కార్యక్రమం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాలిచ్చే తల్లులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భిణుల మొదటి కాన్పు సాధారణ డెలివరీ అయ్యేలా చూడాలని చెప్పారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట ఆరోగ్య కార్యకర్త కమల, ఆశావర్కర్ కళావతి ఉన్నారు.
‘సాగర్’కు చేరిన సింగూరు జలాలు
‘సాగర్’కు చేరిన సింగూరు జలాలు


