
అ‘పూర్వ’ సమ్మేళనం
మోర్తాడ్/ నిజామాబాద్ అర్బన్: మోర్తాడ్ ఉన్నత పాఠశాలలో 1980–81కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 45 ఏళ్ల తర్వాత నాటి మిత్రులందరూ ఒకే చోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. నగరంలోని శ్రీముక్క అయోధ్యరామ్ విద్యానికేతన్‌కు చెందిన 1995–96 పదో తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. నాటి గురువులను ఘనంగా సన్మానించారు. పాఠశాల వ్యవస్థాపకుడు ముక్త దేవేందర్ గుప్తా, ఉపాధ్యాయులు సందీప్ కులకర్ణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అ‘పూర్వ’ సమ్మేళనం