నిజామాబాద్‌అర్బన్ : జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ మొదలైంది. ఇటీవల ప్రభుత్వం టీచర్లకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. గురువారం ముందస్తుగా ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభించింది.
140 మందికి అవకాశం
జిల్లా విద్యాశాఖలో ప్రస్తుతం 140 ఖాళీలు ఉండ గా, వాటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నా రు. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, పండిట్‌లకు సంబంధించి ఖాళీలను పరిగణనలోకి తీసుకొని ప్రక్రియ చేపట్టనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నా రు. గతంలోని రోస్టర్ ప్రక్రియను పరిగణనలోకి తీ సుకొని ఉపాధ్యాయులను ధ్రువపత్రాల పరిశీలన కు ఆహ్వానించారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పు న ధ్రువపత్రాల పరిశీలన చేపడుతున్నారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందే వారికి కేవలం డీఎడ్ అర్హతను పరిగణనలోకి తీసుకొన్నారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ హెచ్‌ఎంగా పదోన్నతులను ఇవ్వనున్నారు. కాగా, మొదటిసారిగా విద్యాశాఖ పదోన్నతుల ప్రక్రియలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయనున్నారు.
వారి సంగతేంటి..?
పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి 1998 డీఎస్సీకి సంబంధించిన కొందరు ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు కొన్నేళ్లుగా పదోన్నతులు స్వీకరించడం లేదు. పదోన్నతులు తిరస్కరించిన వారు సర్వీస్ బుక్‌లో ఆ విషయాన్ని నమోదు చేసుకోవాల్సి ఉండగా, అ లాంటిదేమీ జరగకపోవడంతో ప్రతిసారి వీరి పేర్లు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కూడా లిస్టులో సు మారు 15 పేర్లు ఉన్నాయి. వీరికి మళ్లీ పదోన్నతులు కల్పిస్తారా లేదంటే తొలగిస్తారా అనేది విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సర్టిఫికెట్ల పరిశీలకు హాజరుకావాలి
పదోన్నతులకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనకు శుక్రవారం విద్యాశాఖ కార్యాలయంలో టీచర్లు హా జరుకావాలని డీఈవో అశోక్ తెలిపారు. గ్రేడ్–2 తెలుగు, హిందీ, ఉర్దూ, పీఈటీ ఉపాధ్యాయులు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక జిరాక్స్ సెట్, చెక్ లిస్టులతో రావాలని తెలిపారు. డీఎస్సీ 2017 వరకు ఎస్జీటీ నుంచి స్పెషల్ ఎడ్యుకేషన్‌కు అర్హులైన ఉపాధ్యాయులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలన్నారు.
షెడ్యూల్ విడుదల
జిల్లా విద్యాశాఖలో పదోన్నతులకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. స్కూల్ అ సిస్టెంట్ విభాగంలో ఈ నెల 2న ఖాళీల ప్రద ర్శన చేపడతారు. 3న అభ్యంతరాల స్వీకరణ, 4, 5 తేదీల్లో సీనియారిటీ జాబితా పరిశీలన అనంతరం తుది జాబితాను విడుదల చేస్తా రు. 6న వెబ్ ఆప్షన్, ఎడిటింగ్ అవకాశం ఉంటుంది. 7న పదోన్నతులకు సంబంధించి ఆర్డర్లను జారీ చేస్తారు. 8, 9 తేదీల్లో ఎస్జీటీల ప దోన్నతులకు సంబంధించి ఖాళీల ప్రదర్శన చేపడుతారు. 10న వెబ్ ఆప్షన్లు, ఎడిటింగ్ అ వకాశం ఉంటుంది. 11న పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తారు.
జిల్లాలో 140 మంది
ఉపాధ్యాయులకు అవకాశం
మొదలైన ధ్రువపత్రాల పరిశీలన
పారదర్శకంగా చేపట్టాలి
పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలి. లోటుపాట్లు లేకుండా విద్యాశాఖ పకడ్బందీగా వ్యవహరించాలి. ఉపాధ్యాయులకు ఎలాంటి సందేహాలు లేకుండా వివరాలను అందించాలి. అందరికీ న్యాయం జరిగేలా చూడాలి. లేదంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.
– ఓ రమేశ్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు.
ఎస్సీ టీచర్లకు న్యాయం
ఉపాధ్యాయ పదోన్నతులలో వర్గీకరణను అమలు చేయాలి. మొదటిసారిగా విద్యాశాఖ పదోన్నతుల ప్రక్రియలో వర్గీకరణను అమలు చేసే అవకాశం లభించింది. దీంతో ఎస్సీ టీచర్లకు న్యాయం జరుగుతుంది.
– ఎస్. సురేశ్, మాదిగ ఉద్యోగుల
సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
పదోన్నతులకు కసరత్తు
పదోన్నతులకు కసరత్తు