
అధ్వానంగా అండర్ బ్రిడ్జిలు
జక్రాన్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): ఉమ్మడి జిల్లా పరిధిలో జాతీయ రహదారి 44కు అనుబంధంగా నిర్మించిన అండర్ బ్రిడ్జిల నిర్వహణను గాలికి వది లేశారు. సుమారు 85 కిలోమీటర్ల మేర ఉన్న హైవే పై పెద్ద అండర్ బ్రిడ్జీలు 10, చిన్న బ్రిడ్జీలు 46వరకు ఉన్నా యి. నిర్మాణ డిజైన్‌లో లోపానికి తోడు నిర్వ హణ అ స్తవ్యస్తంగా మారడంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. లైట్లు వెలగకపోయి నా, వర్షపునీరు నిలుస్తున్నా పర్యవేక్షించాల్సిన జాతీ య రహదారుల సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలోని పోచంపాడ్ నుంచి అడ్లూర్ ఎల్లారెడ్డి వరకు అండర్ బ్రిడ్జీలతో 76 గ్రామా లు అనుసంధానమై ఉన్నాయి. 15ఏళ్ల పాటు రోడ్డు మరమ్మతులతో పాటు అండర్ బ్రిడ్జిలు, సర్వీసు రోడ్ల నిర్వహణ బాధ్యత సదరు కాంట్రాక్ట్ సంస్థదే. అయితే అండర్ బ్రిడ్జిల లోపల కూడా లైట్లు సరిగా వెలగకపోవడంతో వాహనదారులు భయపడుతున్నారు.
నిర్మాణంలో లోపాలు
జాతీయ రహదారి నిర్మాణ సమయంలోనే అనేక లోపాలు బయటపడ్డాయి. డిచ్‌పల్లి మండలం సాంపల్లి, బాల్కొండ మండలం శ్రీరాంపూర్, ఇందల్వాయి మండల కేంద్రంలో, సదాశివనగర్‌లో ఒకటి, జక్రాన్‌పల్లి, చాంద్‌మియాబాగ్ ప్రాంతాల్లో అండర్ బ్రిడ్జిలు ఉన్నాయి. కొన్ని చోట్ల అండర్ బ్రిడ్జిలు లేక ఒక పక్క నుంచి మరో పక్కకు తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. వానాకాలంలో బీబీపూర్ తండా వద్ద నిర్మించిన సర్వీసు రోడ్డు పక్కన ఉన్న చెరువు నీరు చేరి ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్రిడ్జిల నిర్మాణంలో లోపాల కారణంగా పెద్ద వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా ఉంది. అండర్ బ్రిడ్జిల నిర్మాణంలో లోపాల కారణంగా వర్షం కురిసినప్పుడు జాతీయ రహదారిపై నుంచి నీరు బ్రిడ్జి కిందకు చేరుతోంది.
అవస్థలు పడుతున్నాం
చాంద్‌మియాబాగ్ వద్ద జాతీయ రహదారిపై నిర్మించిన అండర్ బ్రిడ్జి కింద వర్షపు నీరు నిలవడంతో ప్రయాణానికి ఆటంకం కలుగుతోంది. బ్రిడ్జి కింద బురద నీటిలో ప్రయాణించాలంటే వాహనదారులుఅనేక అవస్థలు పడాల్సి వస్తోంది. బ్రిడ్జి కింద నీరు నిల్వ ఉండకుండా చేసి వాహనదారుల ఇబ్బందులు తొలగించాలి. – కోటేశ్వర్, పడకల్
గుత్తేదారుల నిర్లక్ష్యం వల్లే ఇబ్బందులు
జాతీయ రహదారిపై నిర్మించిన అండర్ బ్రిడ్జిలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అంతేకాక సర్వీసు రోడ్ల నిర్వహణ సరిగా లేదు. గుత్తేదారుల నిర్లక్ష్యం వల్లే వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైన సంబంధిత రోడ్లు నిర్వహణ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. – అంకం నరేశ్, టీచర్, పడకల్
నిర్వహణ గాలికి..
వెలగని లైట్లు.. నిలుస్తున్న వర్షపు నీరు
ఉమ్మడి జిల్లాలో ఎన్‌హెచ్ 44
అనుబంధంగా 10 అండర్ బ్రిడ్జిలు
46 వరకు చిన్న బ్రిడ్జిలు
జక్రాన్‌పల్లిలో నాలుగు..
జక్రాన్‌పల్లి మండల కేంద్రంతోపాటు చాంద్‌మియాబాగ్, సికింద్రాపూర్, అర్గుల్ గ్రామా ల్లో నాలుగు అండర్ బ్రిడ్జిలు ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు బ్రిడ్జి కింద నుంచి నడిచి వె ళ్లలేని పరిస్థితి ఉంది. చాంద్‌మియాబాగ్ బ్రిడ్జి కింద నుంచి పడకల్, కలిగోట్, చింతలూర్ గ్రామాల ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారు. జక్రాన్‌పల్లి బ్రిడ్జి నుంచి మనోహరాబాద్, కొలిప్యాక్, సికింద్రాపూర్ బ్రిడ్జి నుంచి కేశ్‌పల్లి గ్రామస్తులు వెళ్తుంటారు. బ్రిడ్జి కింద నుంచి వెళ్లాలంటేనే వాహనదారులు జంకుతున్నారు.

అధ్వానంగా అండర్ బ్రిడ్జిలు

అధ్వానంగా అండర్ బ్రిడ్జిలు

అధ్వానంగా అండర్ బ్రిడ్జిలు

అధ్వానంగా అండర్ బ్రిడ్జిలు