
ఉద్యమాలను గుర్తుచేస్తున్న ‘రైతాంగ పోరాట గళం’
ఆర్మూర్: ఆర్మూర్ ప్రాంతంలో జరిగిన రైతు ఉద్యమా లను కళాకారుడు సుమన్ రచించి, పాడిన ‘రైతాంగ పోరాట గళం’ అనే పాట గుర్తుచేస్తోందని రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, రైతు జేఏసీ నాయకుడు ప్రభాకర్ కొనియాడారు. పట్టణంలోని కుమార్ నారాయణ భవన్‌లో శుక్రవారం ‘రైతాంగ పోరాట గళం’ పాట సీడీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించా రు. వారు ముఖ్య అతిథులుగా హాజరై, సీడీని ఆవి ష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లు గా ఆర్మూర్ ప్రాంత రైతులు పోరాటాలు చేస్తూ పోలీ సు లాఠీ దెబ్బలు తినడమే కాకుండా అక్రమ కేసులతో జైలు జీవితాన్ని సైతం గడిపారన్నారు. ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర, పసుపు బోర్డు సాధించుకోవడంలో ఈ ప్రాంత రైతాంగం చేసిన ఉద్యమాలు చరిత్రలో ని లిచిపోతాయన్నారు. ఎర్రజొన్న, పసుపు బోర్డు ఉద్య మాల్లో రైతు నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. పాట చిత్రీకరణలో ప్ర ధాన పాత్ర పోషించిన రైతు నాయకుడు మంథని నవీన్‌రెడ్డి, డైరెక్టర్ చిట్టిబాబు, డీవోపీ సంజీవ్, నటులు సూరిబాబు, అనిల్ కుమార్, నిఖిల్, నరేందర్, మంథ ని గ్రామ ప్రజలను వారు అభినందించారు. నాయకు లు మంథని గంగారాం, దేవరాం, కిషన్, ఆకుల గంగారాం, రాజన్న, తిరుపతిరెడ్డి, నారాయణరెడ్డి, శ్రీని వాస్‌రెడ్డి, భరత్, దుర్గాప్రసాద్, రాజారెడ్డి ఉన్నారు.
రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, రైతు జేఏసీ నాయకుడు ప్రభాకర్
ఆర్మూర్‌లో పాటల సీడీ ఆవిష్కరణ