
డివిడెండ్‌తో పీఏసీఎస్‌లకు పునర్‌వైభవం
సుభాష్‌నగర్: ఎన్‌డీసీసీబీ ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు విడుదల చేసిన డివిడెండ్‌తో పునర్‌వైభవం రానుందని ఉమ్మడి జిల్లా సహకార సంఘాల యూనియన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు దయాసాగర్, నర్సయ్య అన్నారు. ఇటీవల జరిగిన ఎన్‌డీసీసీబీ 103వ వార్షిక మహాజనలో చైర్మన్ రమేష్‌రెడ్డి డివిడెంట్ ప్రకటించి, ఖాతాల్లో జమ చేశారు. ఈసందర్భంగా వారు శుక్రవారం నగరంలోని కార్యాలయంలో చైర్మన్ రమేష్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పదేళ్లలో ఎన్నడూలేని విధంగా సహకార సంఘాలకు చైర్మన్ డివిడెంట్ ప్రకటించారని, ఇదే వారి పనితీరుకు నిదర్శమన్నారు. వారి నాయకత్వంలో మరిన్ని మైలురాళ్లు చేరుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్లు గోర్కంటి లింగన్న, రమేష్ పాటిల్, సీఈఓ నాగభూషణం వందే, యూనియన్ నాయకులు వంశీ, మోహిత్ పాష, తదితరులు పాల్గొన్నారు.