ఏడేళ్లుగా మూసిఉన్న సబ్‌ జైళ్లు | - | Sakshi
Sakshi News home page

ఏడేళ్లుగా మూసిఉన్న సబ్‌ జైళ్లు

Aug 2 2025 6:14 AM | Updated on Aug 2 2025 6:14 AM

ఏడేళ్

ఏడేళ్లుగా మూసిఉన్న సబ్‌ జైళ్లు

మీకు తెలుసా?

ఆర్మూర్‌: 2018 జనవరిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సబ్‌ జైళ్లను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయగా అందులో జిల్లాలోని ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ జైళ్లు ఉన్నాయి.

● నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ జైళ్లతో పాటు వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట, పరకాల, ఖమ్మం జిల్లాలోని మదిర సబ్‌ జైళ్లను నిర్వహణ భారం కారణంగా మూసి వేస్తూ అప్పటి జైళ్ల శాఖ జీవో జారీ చేసింది.

● ఆర్మూర్‌ పట్టణంలో అసిస్టెంట్‌ సీనియర్‌ సివిల్‌ కోర్టు (ఫాస్ట్రాక్‌ కోర్టు), జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ కోర్టు, అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టులు ఉన్నాయి.

● ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలోని ఆర్మూర్‌, ఆలూర్‌, నందిపేట, డొంకేశ్వర్‌, జక్రాన్‌పల్లి, బాల్కొండ, మెండోర, ముప్కాల్‌, వేల్పూ ర్‌, మోర్తాడ్‌, ఏర్గట్ల, కమ్మర్‌పల్లి, భీమ్‌గల్‌, సిరికొండ మండలాల పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని కేసులను ఇక్కడ విచారిస్తారు.

● కాగా విచారణలో భాగంగా నిందితులుగా ఉన్న రిమాండ్‌ ఖైదీలను ఆర్మూర్‌ సబ్‌ జైలులో బంధించేవారు. శిక్షలు ఖరారు అయిన అనంతరం వారిని జిల్లా జైలుకు తరలించేవారు.

● కానీ ఆర్మూర్‌తో పోటు బోధన్‌ సబ్‌ జైలును ఎత్తివేయడంతో రిమాండ్‌ ఖైదీలను సైతం జిల్లా కేంద్రానికి తరలించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో ఖైదీలను కోర్టుకు తరలించే బాధ్యత నిర్వహించే పోలీసులపై మరింత పనిభారం పడింది.

రైళ్లల్లో ఉండే కోచ్‌లు

ఖలీల్‌వాడి: రైళ్లలో ప్రయాణించేటప్పుడు స్లీపర్‌, ఏసీ, జనరల్‌ బోగీల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఏసీలో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో 1ఏ, 2ఏ, 3ఏ తరగతులతోపాటు ఇటీవల కొన్ని రైళ్లలో 3ఈ, ఈఏ వంటివి వందేభారత్‌ రైళ్లలో ఈసీ, సీసీ వంటి తరగతులు కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఒక్కో తరగతి(బెర్త్‌) టిక్కెట్‌ ఛార్జీ ఒక్కో రకంగా ఉంటుంది.

యూఆర్‌: అన్‌ రిజర్వ్‌ పిలిచే కోచ్‌లను సెకండ్‌ క్లాస్‌ అంటారు. రిజర్వేషన్‌ లేకుండానే అప్పటికప్పుడు టిక్కెట్‌ తీసుకొని రైళ్లలో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది.

స్లీపర్‌ క్లాస్‌: తక్కువ ఖర్చుతో దూర ప్రయాణం చేసే వారు స్లీపర్‌ క్లాస్‌ టిక్కెట్‌ను ఎంచుకుంటారు. ఇవి నాన్‌– ఏసీ కోచ్‌. ఈ క్యాబిన్‌లో 8 బెర్తులు ఉంటాయి.

సెకండ్‌ సిట్టింగ్‌: స్లీపర్‌ క్లాస్‌ తర్వాత రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం సెకండ్‌ సిట్టింగ్‌ కోచ్‌లో ఉంటుంది. కొన్ని రైళ్లలో మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి.

1ఏ: ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ స్లీపర్‌ను 1ఏ గా పిలుస్తారు. ఇందులో సైడ్‌ బెర్తులు లేకుండా రెండు లేదా నాలుగు బెర్తులు ఉంటాయి. రెండు బెర్తు ఉంటే కూప్‌ అని, 4 బెర్తులు ఉంటే క్యాబిన్‌గా పిలుస్తారు.

2ఏ: దీనిని సెకండ్‌ ఏసీ, టూ టైర్‌ ఏసీ అని పిలుస్తారు. ఇందులో ఉండే క్యాబిన్‌ ఆరు సీట్లు ఉంటాయి. మిడిల్‌ బెర్తులు ఉండవు.

3ఏ: మధ్యతరగతి ప్రజల కోసం ఉండే ఏసీ కోచ్‌ ఇది. స్లీపర్‌ క్లాస్‌ లాగే ఉండగా ఏసీ అదనంగా ఉంటుంది.

3ఈ: థర్డ్‌ ఎకానమీగా పిలిచే ఈ కోచ్‌లు ఎక్కువగా గరీబ్‌రథ్‌, ఫలక్‌నామా రైళ్లలో కనిపిస్తుంటాయి. థర్డ్‌ ఏసీ కంటే తక్కువ ఛార్జీలు ఉంటాయి.

ఈఏ: ఎగ్జిక్యూటివ్‌ అనుభూతిగా పిలిచే కోచ్‌లు శతాబ్ది రైళ్లలో అందుబాటులో ఉంటాయి. ఏసీతో కూడిన కూర్చీలు ఉంటాయి. ఇందులో సినిమాలు, సంగీతాన్ని వినడానికి ఎల్‌ఈడీ టీవీలు ఉంటాయి

ఈసీ: ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌గా పిలిచే తరగతిలో ఏసీతో కూడిన సీట్లు ఉంటాయి. బెర్తులు ఉండవు. ఇవి వందే భారత్‌ రైళ్లలో అందుబాటులో ఉన్నాయి.

సీసీ: ఏసీ చైర్‌కార్‌గా పిలిచే పగటి పూట ప్రయాణించే రైళ్లలో ఈ తరగతి అవకాశం ఉంటుంది. వందేభారత్‌ రైళ్లలో ఇది అందుబాటులో ఉంది.

విస్టాడోమ్‌: పర్యాటక ప్రాంతాల్లో నడిచే రైళ్లలో అద్దాలతో నిర్మితమై ఉంటాయి.

సమాచారం..

ఏడేళ్లుగా మూసిఉన్న సబ్‌ జైళ్లు 1
1/1

ఏడేళ్లుగా మూసిఉన్న సబ్‌ జైళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement