
పదోన్నతుల్లో వర్గీకరణను అమలు చేయండి
నిజామాబాద్‌అర్బన్: విద్యా శాఖలోని టీచర్ల పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు డీఈవో అశోక్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు చట్టబద్ధత తీసుకురావడంతో అమల్లోకి వచ్చిందన్నారు. పదోన్నతుల్లో కూడా వర్గీకరణ అమలు చేయాలని కోరారు. ఎస్సీలలో గ్రూపుల వారిగా విభజనను అమలు చేస్తే అందరికి న్యాయం జరుగుతుందన్నారు. స్పందించిన డీఈవో వర్గీకరణ అమలు చేస్తామని పేర్కొన్నారు. మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేశ్, తెడ్డు గంగారాం, మారుతి, గద్దల రమేశ్ తదితరులు ఉన్నారు.