
రైతులు ఫ్యూజులు మార్చొద్దు
డిచ్‌పల్లి: విద్యుత్ సమస్య ఏర్పడినప్పుడు రైతులు సొంతంగా ఫ్యూజులు మార్చి ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని డిచ్‌పల్లి సబ్‌స్టేషన్ ఏడీఈ శ్రీనివాస్ సూచించారు. గురువారం డిచ్‌పల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని డిచ్‌పల్లి ఖిల్లా గ్రామంలో విద్యుత్ అధికారులు పొలం బాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఈ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే సబ్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిచ్‌పల్లి ఏఈ గంగారాం, లైన్‌ఇన్‌స్పెక్టర్లు అబ్బయ్య, పోశెట్టి, లైన్‌మన్‌లు, జేఎల్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.