
నేనొచ్చి క్లీన్ చేయాలా?
నవీపేట: పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచాలని తెలియదా? నేనొచ్చి క్లీన్ చేయాలా? అంటూ నవీపేట పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. మందుల కొరత లే కుండా చూడాలని ఆదేశించారు. అనంతరం దర్యాపూర్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి అక్కడ వంటశాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులతో మాట్లాడి మెనూ వివరాలను తెలుసుకున్నారు. ఆ వరణలో చుట్టుపక్కల వాసులు చెత్తను పారేయడంతో జీపీ కార్యదర్శి రవీందర్‌నాయక్‌ను మందలించారు. అంగన్‌వా డీ కేంద్రాలను పరిశీలించి చిన్నారుల వివరాలను తెలుసుకున్నారు. నవీపేట ప్రాథమిక పాఠశాలలోని మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లను పరిశీలించారు. సొసైటీ, పశు వైద్యశాల, తహసీల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి భూభారతిపై అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ సమస్యలను పెండింగ్‌లో ఉంచొద్దన్నారు.
● పంచాయతీ కార్యదర్శిపై
కలెక్టర్ సీరియస్
● నవీపేటలో ప్రభుత్వ కార్యాలయాలను
తనిఖీ చేసిన వినయ్ కృష్ణారెడ్డి