
ఎమ్మెల్యే ధన్‌పాల్ కృషితోనే ఇంజినీరింగ్ కళాశాల మంజూరు
నిజామాబాద్ రూరల్: తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయడంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కీలక పాత్ర వహించారని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్నాటి కార్తిక్, నాయకులు అన్నారు. నగరంలోని దేవి టాకిస్ చౌరస్తాలో ఎమ్మెల్యే ధన్‌పాల్ చిత్రపటానికి బీజేవైఎం నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు సాయికుమార్, సురేశ్, అక్షయ్, అందోల్ రాజు, అనిల్, రాజశేఖర్, సంజయ్ పురోహిత్, ప్రశాంత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.