
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
నిజామాబాద్ సిటీ/ నిజామాబాద్‌అర్బన్: ప్రభు త్వం జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయడంపై జిల్లా ఎన్‌ఎస్‌యూఐ నాయకులు సంబురాలు చేపట్టారు. గురువారం నగరంలోని ధర్నాచౌక్ వద్ద పటాకులు కాల్చి, మిఠాయిలు పంచారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి వేణురాజ్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ కళాశాల కోసం ఎన్నో పోరాటాలు చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీ రావడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు నవీన్, రమేశ్, గంగప్రసాద్, నరేందర్ సింగ్, సాయికిరణ్, కౌశిక్, మణి, రాజు పాల్గొన్నారు.