నిజామాబాద్‌నాగారం: రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో రాణించి జిల్లా పతకాలు తీసుకరావాలని జిల్లా యువజన క్రీడల అధికారి పవన్‌కుమార్ అన్నారు. నిజామాబాద్ జిల్లా జూడో అసోసియేషన్ కార్యదర్శి అభినవ్ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని ప్రభుత్వ స్విమ్మింగ్‌పూల్ ఆవరణలో సబ్‌జూనియర్, క్యాడెట్ బాలబాలికలకు జూడో ఎంపికలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులను డీవైఎస్‌వో ప్రత్యేకంగా అభినందించారు. పీఈటీలు అనిత, శ్యామల, వికాస్, శ్రీకాంత్, నవీన్, మానస, క్రీడాకారులు పాల్గొన్నారు.