
కరెంట్ మీటరుపై పేరు మార్చాలా?
మీకు తెలుసా?
కమ్మర్‌పల్లి: విద్యుత్ మీటరుపై పేరు మార్పు కోసం వినియోగదారుల సౌకర్యార్థం విద్యుత్ సంస్థ వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచింది.
● టీజీఎన్‌పీడీసీఎల్ వెబ్‌సైట్‌ను తెరిచి ‘కన్జ్యూమర్ సర్వీసెస్’పై క్లిక్ చేస్తే పలు సేవలు కన్పిస్తాయి. అందులో సర్వీస్ రిక్వెస్ట్ విండోపై క్లిక్ చేయాలి.
● కరెంట్ బిల్లుపై ఉండే యూనిక్ సర్వీస్ నెంబరు, మొబైల్ నెంబరు నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేయగానే అక్కడ అందించే సర్వీసులు కన్పిస్తాయి.
● వాటిలో టైటిల్ ట్రాన్స్‌ఫర్, చిరునామా మార్పు, అదనపు లోడు, లైన్ల మార్పు, కేటగిరి మార్పు వంటివి ఉంటాయి.
● టైటిల్ ట్రాన్స్‌ఫర్‌పై క్లిక్ చేసి అవసరమైన మూడు డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
● రిజిస్టర్డ్ సేల్ డీడ్/గిఫ్ట్ డీడ్, వ్యక్తిగత గుర్తింపు పత్రం(ఏదైనా ఐడీ), రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపరుతో కూడిన ఇండెమ్నిటీ బాండ్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.
● బాండ్‌కు సంబంధించిన ఫార్మాట్ కూడా అక్కడే ఉంటుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు సమర్పించాలి.
● గుర్తింపు పత్రం జేపీజీ/పీఈజీ ఫార్మాట్‌లో ఉండాలి. వీటి సైజు 100కేబీ లోపు, ఇండెమ్నిటీ బాండ్ పీడీఎఫ్ రూపంలో 500 కేబీ లోపు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ పీడీఎఫ్ 5ఎంబీ లోపు సైజు ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి.
● అన్ని డాక్యుమెంట్లపై సంతకం తప్పనిసరి. ఆ తర్వాతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ చార్జ్ రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.
● తర్వాత విద్యుత్ శాఖ వారు వివరాలన్నీ పరిశీలించి, అన్ని సరిగా ఉంటే మీ బిల్లుపై పేరును మార్పు చేస్తారు.