
నేడు ఇన్‌చార్జి మంత్రి సీతక్క రాక
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క (ధనసరి అనసూ య) నిజామాబాద్ నగరంలో మంగళవారం పర్యటించనున్నా రు. మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్న ఆమె.. 3గంటలకు కలెక్టరేట్ సముదాయంలో నిర్వహించనున్న సమీక్షాసమావేశంలో పాల్గొంటారని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి తెలిపారు. ఆ తరువాత హోట ల్ హరితలో నిర్వహించనున్న కాంగ్రెస్ ఆదివాసీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారని పార్టీ ఎస్టీ విభాగం అధ్యక్షుడు కేతావత్ యా దగిరి తెలిపారు. సాయంత్రం 6గంటలకు హైదరాబాద్‌కు తిరిగి బయల్దేరుతారు.
ప్రజావాణికి
112 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను స త్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కి రణ్‌కుమార్ అధికారులకు సూచించారు. స మీకృత జిల్లా కార్యాలయాల సముదాయ స మావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 112 ఫిర్యాదులు అందా యి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ చ్చిన వారు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌తోపాటు ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సా యాగౌడ్, డీపీవో శ్రీనివాస్, మెప్మా పీడీ రా జేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రావుకు వివరి స్తూ ఫిర్యాదులను అందజేశారు. ఫిర్యాదుల ను పెండింగ్‌లో ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ఎరువుల
కొరత లేదు
వర్ని : జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ అన్నారు. మోస్రా మండ ల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సహకా ర సంఘ భవనంతోపాటు గిడ్డంగిని సోమ వారం ఆయన ప్రారంభించారు. రైతులు స హకార సంఘాల ద్వారా తీసుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను చెల్లించి తిరిగి రుణాలు పొందాలని సూచించారు. ఎరువు లు కొనుగోలు చేసిన రైతులు బిల్లులు తప్పకుండా తీసుకోవాలన్నారు. విండో చైర్మన్ జ గన్‌మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
‘ఓపెన్’ ఫీజు చెల్లించాలి
నిజామాబాద్ అర్బన్: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈవో అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ రుసుంతో ఈ నెల 28 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు చెల్లించవచ్చునన్నా రు. రూ.25 అపరాధ రుసుముతో ఆగస్టు 10 వరకు, రూ 50 అపరాధ రుసుముతో 15వరకు, తాత్కాల్ రుసుముతో 18వ తేదీ వరకు టీఎస్ ఆన్‌లైన్, మీసేవ సెంటర్లలో చెల్లించాలని పేర్కొన్నారు.