దృష్టిలో పడేందుకు.. | - | Sakshi
Sakshi News home page

దృష్టిలో పడేందుకు..

Jul 29 2025 9:11 AM | Updated on Jul 29 2025 9:11 AM

దృష్ట

దృష్టిలో పడేందుకు..

నిజామాబాద్‌
ఎవరి ప్లాన్లు వారివి..

ఆలయాల అభివృద్ధికి..

ఆలయాల అభివృద్ధికి చైర్మన్‌తో సహా కమిటీ సభ్యులు కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ సూచించారు.

మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025

– 8లో u

ఆగస్టు 2, 3 తేదీల్లో ఆర్మూర్‌ నియోజకవర్గంలో

మీనాక్షి నటరాజన్‌ పర్యటన

ఆమెతోపాటు పాదయాత్ర, శ్రమదానంలో పాల్గొనేందుకు

కాంగ్రెస్‌ నాయకుల ప్రణాళికలు

ఆర్మూర్‌

నియోజకవర్గం

కాంగ్రెస్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేయడమే లక్ష్యంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఆర్మూర్‌ నియోజక

వర్గంలో పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె

దృష్టిలో పడేందుకు నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్న వారితోపాటు స్థానిక ఎన్నికల బరిలో నిలువాలనుకుంటున్న నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మీనాక్షి నటరాజన్‌ పాదయాత్ర

తమ రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేయాలని కోరుకుంటున్నారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఆగస్టు 2, 3 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. 2న సాయంత్రం ఆర్మూర్‌ నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర చేయనున్నారు. ఇదే నియోజకవర్గంలో రాత్రి బస చేయనున్నారు. 3న ఉదయం శ్రమదానం కార్యక్రమంలో మీనాక్షి పాల్గొననున్నారు. అదేవిధంగా అసంఘటిత కార్మికులతో సమావేశం కానున్నారు. అనంతరం అదేరోజు మధ్యాహ్నం ఉమ్మడి జిల్లాలోని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి మీనాక్షి నటరాజన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా జై భీమ్‌, జై బాపు, జై సంవిధాన్‌ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే మీనాక్షి కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా మీనాక్షి పర్యటనకు సంబంధించి మంగళవారం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రూట్‌మ్యాప్‌ షెడ్యూల్‌ ఖరారు చేయనున్నారు. ఇందులో భాగంగా సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.

నాలుగేళ్ల క్రితం జిల్లాలో పాదయాత్ర..

రాజీవ్‌గాంధీ పంచాయతీ సంఘటన్‌ చైర్మన్‌గా నాలుగేళ్ల కిందట మీనాక్షి నటరాజన్‌ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం సిర్నాపల్లి నుంచి ఆమె పాదయాత్ర నిర్వహించారు. జక్రాన్‌పల్లి మండలంలో, ఆర్మూర్‌ మండలంలో, బాల్కొండ మండలాల్లోనూ ఆమె ఆ సమయంలో పాదయాత్ర చేశారు. అప్పటి పాదయాత్రలో పాల్గొన్న నాయకులతో మీనాక్షి ఇప్పటికీ నిరంతరం మాట్లాడుతూ వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పూర్తిగా గ్రామీణప్రాంతాలపైనే ఆమె ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నారు. గతంలో మీనాక్షి పాదయాత్ర చేశాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించామని, ఈసారి సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ గెలుపును నమోదు చేస్తామని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం మీనాక్షి నటరాజన్‌ చేయనున్న పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాల్లో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కూడా పాల్గొననున్నారు.

న్యూస్‌రీల్‌

రాహుల్‌గాంధీ కోర్‌ టీమ్‌లో కీలకమైన నాయకురాలిగా ఉన్న మీనాక్షికి ఢిల్లీలో అధినాయకత్వం వద్ద గట్టి పట్టుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలువురు నామినేటెడ్‌ పదవుల ఆశావహులు, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు, పార్టీ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పదవులు ఆశిస్తున్నవారు ఆమె దృష్టిలో పడేందుకు, ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. సర్పంచ్‌, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, నగరంలో కార్పొరేటర్లుగా బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నవారు. జెడ్పీ చైర్మన్‌, మున్సిపల్‌ చైర్మన్లు, నగర మేయర్‌ పదవులు ఆశిస్తున్నవారు, రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవు లు కోరుతున్నవారు మీనాక్షి దృష్టిలో పడేందుకు గట్టి ప్ర యత్నాలు చే సుకుంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లో పదవులు దక్కించుకునేందుకు ఎవరి పా ట్లు వారు పడుతున్నారు. ఇక మండల కాంగ్రెస్‌ అధ్యక్ష పదవులు, జిల్లా కాంగ్రెస్‌ పదవి రేసులో ఉన్నవారు సైతం ఈ పర్యటనను సద్వినియో గం చేసుకునేందుకు ఎవరి ప్లాన్లు వారు వేసు కుంటున్నారు.

దృష్టిలో పడేందుకు..1
1/3

దృష్టిలో పడేందుకు..

దృష్టిలో పడేందుకు..2
2/3

దృష్టిలో పడేందుకు..

దృష్టిలో పడేందుకు..3
3/3

దృష్టిలో పడేందుకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement