
రవాణాశాఖలో ఫీజుల మోత!
రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం
ఖలీల్‌వాడి : రవాణాశాఖ ఫీజుల మోత మోగించింది. ఆదివారం నుంచి పెరిగిన ఫీజులు అమలులోకి వచ్చాయి. దీంతో వాహనాదారులు, లైసెన్స్‌దారులకు రవాణాశాఖ సేవలు మరింత భారం అవుతున్నాయి. ఎలాంటి బహిరంగ ప్రకటన లేకుండానే రవాణాశాఖ పలు సేవల ధరలను పెంచుతూ ఆ శాఖ వెబ్‌సైట్‌లో నూతన ఫీజులను అప్‌డేట్ చేసేసింది. పలు సేవల ఫీజులు కొంత పెరగగా, మరికొన్నింటి ఫీజులు వాహనాదారులకు భారం కానున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు సైతం మారింది. గతంలో రవాణాశాఖ అధి కారులు ఫీజుల పెంపునకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించగా, ప్రభుత్వం అనుమతించినట్లు సమాచారం.
రూ.50 నుంచి రూ.వెయ్యి వరకు పెంపు
ఆదివారం నుంచి ట్రాన్స్‌పోర్ట్
వెబ్‌సైట్‌లో అప్‌డేట్