
రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి
ఖలీల్‌వాడి: డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు సంభవించవని నిజామాబాద్ ఆర్టీసీ ఆర్‌ఎం జ్యోత్స్న అన్నారు. నిజామాబాద్ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో మంగళవారం ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్ల ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్‌ఎం మాట్లాడుతూ.. వాహనం నడపడానికి ముందు ప్రాథమిక తనిఖీలు చేయాలన్నారు. సాంకేతిక సమస్యలు గుర్తించిన వెంటనే గ్యారేజీకి నివేదించాలన్నారు. ప్రయాణికులతో శాంతంగా, మర్యాదగా మాట్లాడాలని, పెద్దవారికి, మహిళలకు, చిన్నపిల్లలకు సహాయంగా ఉండాలన్నారు. డ్రైవర్లు సమయపాలన పాటించాలని, ఉద్యోగం పట్ల నిజాయితీగా ఉండాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనం వినియోగించకూడదన్నారు. ఆర్టీసీ గౌరవం కాపాడే బాధ్యత డ్రైవర్లు, సిబ్బంది పై ఉందన్నారు.