
వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు ‘రుద్రూర్’ అనువైనది
రుద్రూర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంజూరైన వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్ర అనువైన ప్రాంతమని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం భవనాలు, క్వార్టర్లు, ఆడిటోరియం, వసతి భవనాలను ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం పోచారం మాట్లాడుతూ.. వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు అనువైన ప్రాంతం కోసం ప్రత్యేక బృందం స్థల పరిశీలన చేస్తున్నదన్నారు. రుద్రూర్ పరిశోధన కేంద్రం పరిధిలో మూడు వందల ఎకరాల స్థలం, మౌలిక వసతులు, భవనాలు, ప్రయోగ శాలలు, ఆడిటోరియం, వసతి గృహలు ఉన్నాయన్నారు. ఇక్కడే వ్యవసాయ పాలిటెక్నిక్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలలు కొనసాగుతున్నాయని, శాస్త్రవేత్తలు నిరంతరం నూతన వరి, చెరుకు వంగడాల రూప కల్పనలో నిమగ్నమవుతున్నారన్నారు. ఈ ఆంశాలు వందశాతం వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు దోహదపడుతాయన్నారు. ఈ ఆంశాలను సీఎం, మంత్రులకు వివరిస్తానన్నారు.
పరిశోధన కేంద్రం ఇన్‌చార్జి హెడ్ పరమేశ్వరి, ఫుడ్‌సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి, తహసీల్దార్ తారాబాయి, ఎంపీడీవో భీమ్‌రావ్, మాజీ ఎంపీటీసీ నరోజి గంగారాం, విండో చైర్మన్ సంజీవరెడ్డి, మాజీ చైర్మన్ పత్తి రాము, నాయకులు తోట అరుణ్‌కుమార్, రామగౌడ్, పార్వతి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ
సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
రుద్రూర్ వ్యవసాయ పరిశోధన
కేంద్రం పరిశీలన