
అభివృద్ధి పనులకు అధిక నిధులు
వర్ని (మోస్రా): ప్రజా సంక్షేమం, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎ మ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మో స్రా మండల కేంద్రంలో నిర్మిస్తున్న మండల సముదాయ భవనాలను బుధవారం ఆయన పరిశీలించారు. వచ్చే నెల 4న మోస్రా, చందూర్ మండల కేంద్రాల్లో మండల సముదాయ భవనాలు, జనరల్ ఫంక్షన్ హాల్, గ్రామ పంచాయతీ భవనాలను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించనున్నట్లు తెలిపారు. మిగిలిన పనులను పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.