ఆయిల్‌ పామ్‌ నర్సరీని సందర్శించిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ పామ్‌ నర్సరీని సందర్శించిన కలెక్టర్‌

Jul 31 2025 7:14 AM | Updated on Jul 31 2025 9:04 AM

ఆయిల్

ఆయిల్‌ పామ్‌ నర్సరీని సందర్శించిన కలెక్టర్‌

పెర్కిట్‌(ఆర్మూర్‌): ఆర్మూర్‌ మండలం చేపూర్‌లో ఏర్పాటు చేసిన ఆయిల్‌ పామ్‌ నర్సరీని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌ సాగుతో కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా తోడ్పాటును అందజేస్తామన్నారు. నర్సరీలో లక్షన్నర ఎకరాలకు సరిపడా మొక్కలను అందుబాటులో ఉంచడంపై కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్‌ రావు, ఏడీఏ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

జ్యుడీషియల్‌ అసోసియేషన్‌

సంయుక్త కార్యదర్శిగా శ్రీదేవి

ఆర్మూర్‌టౌన్‌: రాష్ట్ర హైకోర్టు జ్యుడీషియల్‌ అసోసియేషన్‌ ఎన్నికలలో సంయుక్త కార్యదర్శిగా ఆర్మూర్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి గెలుపొందారు. ఈ సందర్భంగా జూనియర్‌ సివిల్‌ జడ్జి సరళరాణి, ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం జడ్జి శ్రీదేవిను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జక్కుల శ్రీధర్‌, జెస్సు అనిల్‌, ఉపాధ్యక్షుడు గటడి ఆనంద్‌, కోశాధికారి గజ్జల చైతన్య, కార్యదర్శి శ్రావణ్‌, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజన బిల్లులు విడుదల

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాలోని మధ్యాహ్న భోజనానికి సంబంధించి 2025– 26 సంవత్సర రెగ్యులర్‌ బిల్లులు కోసం నిధులు విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు కుకింగ్‌ నిధులు రూ.2 కోట్ల 15 లక్షల 328, సీసీహెచ్‌ల గౌరవ వేతనం రూ.48 లక్షలు ఆయా మండలాల వారీగా రిలీజ్‌ చేశామన్నారు.

విద్యార్థులతో

పాఠశాల పనులు

నిజామాబాద్‌అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లు చేయాల్సిన పనులను విద్యార్థులతో చేయిస్తున్నారు. జిల్లాలోని ఎడపల్లి మండలం మంగల్‌పాడ్‌ పాఠశాలలో ఇద్దరు స్కావెంజర్లు ఉన్నా అక్కడి ఉపాధ్యాయులు విద్యార్థులతో పనులు చేయిస్తున్నారు. పాఠశాల ఆవరణ ఊడ్చడం, బెంచీలు, కుర్చీలను మోయించడం తదితర పనులు చేయిస్తున్నారు. బుధవారం పాఠశాలలో విద్యార్థులు వివిధ పనులు చేస్తూ కనిపించారు. స్కావెంజర్లు ఇలా వచ్చి అలా వెళ్తున్నారని, హెచ్‌ఎం కూడా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు తెలిపారు. చదువుకోవాల్సిన పిల్లలతో పనులు చేయించడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఆయిల్‌ పామ్‌ నర్సరీని సందర్శించిన కలెక్టర్‌ 1
1/2

ఆయిల్‌ పామ్‌ నర్సరీని సందర్శించిన కలెక్టర్‌

ఆయిల్‌ పామ్‌ నర్సరీని సందర్శించిన కలెక్టర్‌ 2
2/2

ఆయిల్‌ పామ్‌ నర్సరీని సందర్శించిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement