ఆదివాసీలను నాయకులుగా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీలను నాయకులుగా తీర్చిదిద్దుతాం

Jul 30 2025 7:26 AM | Updated on Jul 30 2025 7:26 AM

ఆదివాసీలను నాయకులుగా తీర్చిదిద్దుతాం

ఆదివాసీలను నాయకులుగా తీర్చిదిద్దుతాం

నిజామాబాద్‌ సిటీ: దేశవ్యాప్తంగా 25 వేల మంది ఆదివాసీలను నాయకులుగా తీర్చిదిద్దుతామని, అందులో భాగంగానే శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని హోటల్‌ హరితలో మంగళవారం నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆదివాసీ గిరిజన చైర్మన్‌ కెతావత్‌యాదగిరి అధ్యక్షతన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఆదివాసీ గిరిజన శిక్షణా తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ సూచనలతో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొమ్మమహేష్‌కుమార్‌ గౌడ్‌ల ఆదేశాలతో తెలంగాణలో ఎస్టీలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్రం చర్యలతో ఆదివాసీల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్‌ బాధ్యత తీసుకుంటుందన్నారు.

ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ మాట్లాడుతూ.. జల్‌–జమీన్‌–జంగిల్‌ (నీరు, అట వీ, భూ వనరులు)పై గిరిజన హక్కుల కోసం కాంగ్రెస్‌ కట్టుబడి ఉందన్నారు. గిరిజనుల అటవీ భూ ములు, ఇతర వనరులు హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ ఎల్లపుడూ పోరాడుతూనే ఉందన్నారు.

మాజీ ఎంపీ మదుయాష్కీగౌడ్‌ మాట్లాడుతూ.. ఈ శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన వారు ఆదివాసి, గిరిజనులను సరైన మార్గంలో నడిపించి రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలన్నారు.

కాంగ్రెస్‌పార్టీ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు బెల్లయ్య నా యక్‌ మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్‌ బొమ్మ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సూచనలతో ఇప్పటివరకు 6 జిల్లాల్లో శిక్షణా తరగతులు పూర్తిచేయగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా 7వది అని తెలిపారు. జాతీయ కన్వీనర్‌ రాహుల్‌బాల్‌, ట్రైకార్‌ రాష్ట్ర చైర్మన్‌ తేజావత్‌ బెల్లయ్య నాయక్‌, ఎస్టీసెల్‌ జిల్లా చైర్మన్‌ కెతావత్‌ యాదగిరి రాథోడ్‌, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌హందాన్‌, టీఎస్‌సీడ్స్‌ చైర్మన్‌ అవినాష్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజారెడ్డి, పీసీసీ డెలిగేట్‌ బాడ్సి శేఖర్‌గౌడ్‌, కామారెడ్డి జిల్లా చైర్మన్‌ రాణా ప్రతాప్‌ రాథోడ్‌, నాయకులు కోటియా నాయక్‌, మల్లేశ్వరి, చంద్రకళ, గణేష్‌ నాయక్‌, వినోద్‌ నాయక్‌, నరేష్‌ నాయక్‌, సునీల్‌ జాదవ్‌, మల్లికార్జున్‌, కెతావత్‌ ప్రకాష్‌ నాయక్‌, హరినాయక్‌ పాల్గొన్నారు.

గిరిజనుల హక్కులను

కేంద్రం హరిస్తోంది

జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క

నగరంలో ఆదివాసీ గిరిజన కాంగ్రెస్‌ ఉమ్మడి జిల్లా శిక్షణా తరగతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement