
కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
ఎల్లారెడ్డిరూరల్: పట్టణంలోని న్యూ ఆబాది కాలనీకి చెందిన అర్హాన్ అనే బాలుడిపై కుక్కలు దాడి చేసి గాయపర్చిన ట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. బాలు డు మంగళవారం రాత్రి ట్యూషన్ నుంచి వస్తుండగా కుక్కలు వెంటపడి గాయపర్చాయి. ఎల్లారెడ్డి పట్టణంలో 8 మందిని కుక్కలు దాడి చేసి గాయపర్చిన ఘటన మరవక ముందే బాలుడిపై దాడి చేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి పట్టణంలో కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తాళం వేసిన ఏడిళ్లలో చోరీ
సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి తాళం వేసి ఉన్న ఏడు ఇళ్లల్లో చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలోని పలువురి ఇళ్లకు ఉన్న తాళాలు పగలగొట్టి ఉండటంతో మంగళవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గుర్తుతెలియని దుండగులు గ్రామంలోని మల్కి నరేష్ ఇంటి వద్ద సీసీ కెమెరా ఉండగా దానిపై వస్త్రం పడేసి, తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని తులం మూడు గ్రామాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. యాదుల్ అనే వ్యక్తి ఇంట్లో రూ.పది వేల నగదు, పదిహేను తులాల వెండి వస్తువులు, మేర గంగాదాసు ఇంట్లో రూ.4వేల నగదు ఎత్తుకెళ్లారు. మరో నాలుగిళ్ల తాళాలను ధ్వంసం చేయగా, చోరీ ఏమి జరగలేదని గ్రామస్తులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై రామకృష్ణలు చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కొండ చిలువను చంపిన గ్రామస్తులు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మత్తడికింది పల్లె శివారులో మంగళవారం సాయంత్రం స్థానికులు కొండ చిలువను చంపారు. కొండచిలువ గుర్తు తెలియని జంతువును మింగివేడయంతోనే చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. కొండ చిలువ సమీపంలోని గుట్టల పైనుంచి వచ్చిందా, పెద్దవాగు శివారులో నుంచి వచ్చిందో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండ చిలువ సుమారు 8 అడుగులపైన పొడవు ఉంటుందని వారు తెలిపారు.

కుక్కల దాడిలో బాలుడికి గాయాలు