
నూతన ఆవిష్కరణలతో సమాజానికి మేలు
నిజామాబాద్‌అర్బన్: ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే ఆవిష్కరణలు సమాజానికి మేలు చేస్తాయని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ రాంమోహన్‌రెడ్డి అన్నారు. కళాశాలలో మంగళవారం తెలంగాణ ఆవిష్కరణల విభాగం ఆధ్వర్యంలో ‘నూతన ఆవిష్కర్తల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. చదువుతో సంబంధం లేకుండ కూడా కొత్తకొత్త ఆలోచనలతో ఎన్నో ఆవిష్కరణలు వస్తున్నాయన్నారు. వారిని ప్రోత్సహించాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఔత్సాహిక విద్యార్థులు వివిధ రకాల ఆవిష్కరణల గురించి ప్రస్తావించారు. రమేష్, అనూష, ముత్తెన్న, చంద్రశేఖర్, పూర్ణ చందర్ రావు, రామస్వామి, రమేశ్ గౌడ్ పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీవీ నూతన కార్యవర్గాన్ని మంగళవారం తెయూలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పృథ్వీరాజ్, ప్రధాన కార్యదర్శిగా సమీర్ ఎన్నికయ్యారు. కమిటీ ఉపాధ్యక్షులుగా అక్షయ్, అశోక్, అజయ్, మనోజ్, జ్యోతి, జాయింట్ సెక్రెటరీలుగా నవీన్, లెనిన్, అఖిల్, రాకేష్, నరేందర్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర ఆల్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్ మాట్లాడుతూ.. 60 లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ ఉందన్నారు. అనంతరం ఈ నెల 8న ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన విద్యార్థులకు ధ్రువపత్రాలను అందజేశారు. సభ్యులు శివ, విభాగ్ సంఘటన మంత్రి హర్ష, రాష్ట్ర కార్య సమితి సభ్యులు అమృత్‌చారి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోహన్, నాయకులు సాయికుమార్, నవీన్, నాగరాజు, ప్రమోద్ పాల్గొన్నారు.
అథ్లెటిక్స్ పోటీలో కంజర విద్యార్థి ప్రతిభ
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని నాగారం రాజారాం స్టేడియంలో ఇటీవల అండర్–12 జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మోపాల్ మండలానికి చెందిన కంజర పాఠశాల విద్యార్థి కుందన్ సిద్ధాంత్ జావెలిన్‌త్రోలో రెండో స్థానంలో నిలిచినట్లు పాఠశాల హెచ్‌ఎం తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థిని ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు.

నూతన ఆవిష్కరణలతో సమాజానికి మేలు