
కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
నిజామాబాద్ అర్బన్: ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు బీఆర్‌ఎస్‌వైపు మొగ్గు చూపుతున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. ఇందూరు గడ్డ నుంచే కాంగ్రెస్ పూర్తిస్థాయిలో మట్టికరుస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో సెటిల్‌మెంట్లు, దోపిడీలు పె రిగిపోయాయి ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం వద్దు.. కేసీఆర్ రాజ్యం ముద్దు.. నినాదంతో ముందుకు వెళ్తామని, గ్రామగ్రామాన పార్టీలను శ్రేణులను సమాయత్తం చేస్తామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ కేసీఆర్ రావాల్సిందేనని అ న్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందని ద్రాక్ష లా మారాయని, ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగ లో తొక్కిందని విమర్శించారు. జాబ్ క్యాలెండర్‌కు అతీగతీ లేదని, నిరుద్యోగ భృతిని మరిచిపోయార న్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయ న్నారు. నాయకులు సుజిత్‌సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, ప్రభాకర్, భూమేశ్, నరేందర్, సంతోష్, రజినీశ్, వెల్మల్ సురేశ్, సుంకర రవి, రంజిత్ పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం
పేదలకు అందని ద్రాక్షలా ఇందిరమ్మ ఇళ్లు
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
ఆశన్నగారి జీవన్‌రెడ్డి