
సబ్ కంట్రోల్ పునరుద్ధరణ
ఖలీల్‌వాడి : నిజామాబాద్ నగరంలోని ప్రధాన జంక్షన్‌లలో పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్‌లను పునరుద్ధరించనున్నట్లు పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య తెలిపారు. గతంలో నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, బోధన్ బస్టాండ్, అర్సపల్లి చౌరస్తా, చార్ భాయ్ పె ట్రోల్ బంక్, వీక్లి మార్కెట్, కంఠేశ్వర్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో కొనసాగిన సబ్ కంట్రోల్ రూమ్ లను సీపీ శుక్రవారం రాత్రి పరిశీలించారు. సబ్ కంట్రోల్ రూమ్‌లను వాడకంలోకి తీసుకువచ్చేలా అధి కారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ని యంత్రణ కోసం ఆయా జంక్షన్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీలతో సీసీ కెమెరాల ను ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన ప్రాంతా ల్లో కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా, స్టాఫ్ లైన్‌ల ఏ ర్పాటు, ఫ్రీ లెఫ్ట్ కార్యాచరణ రూపొందించాలని, హనుమాన్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్‌ను పునరుద్ధరించాలని ఆదేశించారు. సీపీ వెంట ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ, సీఐ పి ప్రసాద్, ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి, రిజర్వ్ సీఐ (వెల్ఫేర్) తిరుపతి తదితరులు ఉన్నారు.
● ప్రధాన జంక్షన్‌లలో
ఏఐ టెక్నాలజీ సీసీ కెమెరాలు
● నిజామాబాద్ నగరంలో
పర్యటించిన సీపీ సాయిచైతన్య