గడువులోపు లక్ష్యాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోపు లక్ష్యాలు సాధించాలి

Oct 30 2026 11:55 PM | Updated on Oct 30 2026 11:55 PM

ఉట్నూర్‌రూరల్‌: వివిధ శాఖల భాగస్వామ్యంతో వీబీ జీరామ్‌జీ లక్ష్యాలను గడువులోపు సాధించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, వీబీ జీరామ్‌జీ పథకాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాలోని ఎంపీడీవోలు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులతో గూగుల్‌ మీట్‌ ద్వారా సమన్వయ సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలపై సమగ్రంగా చర్చించారు. పథకం అమలును అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, అర్హులైన ప్రతీ లబ్ధిదారుకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందులను పరస్పర సమన్వయంతో పరిష్కరించుకోవాలని, ఎప్పటికప్పుడు పురోగతి నివేదికలను అందించాలని ఆదేశించారు. ఈ సమావేశం ద్వారా వివిధ శాఖల మధ్య సమన్వయం మరింత బలపడి, గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement