కైలాస్‌నగర్: జిల్లాకు చెందిన గడ్డం శశికళ, కట్ట సుజాత, మద్ది లక్ష్మణ్ ఉపాధ్యాయ బృందం ఇటీవల వియత్నాం దేశంలో పర్యటించింది. ఐదు రోజులు పర్యటించిన ఈ బృందం సభ్యులు ఆదేశంలోని విద్యావిధానాలు, బోధనా పద్ధతులు, విద్యాభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి అక్కడ అమలవుతున్న విద్యా కార్యక్రమాలు, బోధనా వి ధానాలు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను క్షే త్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడి వి ద్యా రంగంలో అనుసరిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను జిల్లాలోనూ అమలు చేసేందుకు అనువైన అంశాలను గుర్తించారు. భవిష్యత్‌లో చేపట్టాల్సిన కా ర్యాచరణపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్ రాజర్షి షాను తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలి సి శాలువాతో సత్కరించారు. తమ వియత్నాం ప ర్యటన విశేషాలు వివరించారు. అక్కడ పరిశీలించి న విద్యా విధానాలు, జిల్లాలో అమలు చేయడానికి రూపొందించిన ప్రణాళికను అందజేశారు. ఓ పెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ అశోక్, ఏఎంవో లక్ష్మణ్, సెక్టోరల్ అధికారి తిరుపతి తదితరులున్నారు.


