వేటగాళ్ల ఉచ్చులో మూగజీవాలు | - | Sakshi
Sakshi News home page

వేటగాళ్ల ఉచ్చులో మూగజీవాలు

Oct 30 2026 11:55 PM | Updated on Oct 30 2026 11:55 PM

ఖానాపూర్‌: వన్యప్రాణుల వేట కోసం అమర్చినట్లు భావిస్తున్న నాటు బాంబు తరహా పేలుడు పదార్థం ఓ మూగజీవానికి తీవ్ర గాయాలు చేసింది. మండలంలోని మస్కాపూర్‌ గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు ఎప్పటిలాగే పశువులను మేత కోసం గంగయ్యపేట అట వీ ప్రాంతానికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా పెద్దమ్మతల్లి ఆలయ సమీపంలోని రహదారి పక్కన తౌడుతో తయారు చేసిన ముద్దలు కనిపించాయి. వాటిని తినే క్రమంలో రైతు దెబ్బడి రాజేశ్వర్‌కు చెందిన దుక్కిటి ఎద్దు నోటిలో పేలుడు సంభవించింది. దీంతో ఎద్దు దవడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అటవీ జంతువులను వేటాడేందుకు కొందరు తౌడు ముద్దల్లో నాటు బాంబులు అమర్చి అటవీ ప్రాంతాల్లో వదిలేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం కూడా ఓ అడవి పందిని వేటాడి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అటవీ, పోలీసు అధికారులు ఘటనపై విచారణ జరిపి బాధ్యులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement