తానూరు: పెరల్స్ ఆగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ భూ బాధిత రైతుల సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అన్నారు. మొగ్లి గ్రామంలో భూబాధితులతో మంగళవారం సమావేశం ఏర్పా టు చేసి మాట్లాడారు. రైతులు తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గతంలో రైతులు పెరల్స్ ఆగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీకి ఒక ఎకరం భూమి అమ్మినా మిగులు భూమిని లాక్ పడడంతో తమ పంట భూమి అమ్ముకోలేకపోతున్నామని తెలిపారు. 15 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. బాధిత రైతుల నుంచి పూర్తి వివరాలను సేకరించి, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, జీపీవోల ద్వారా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు ఉన్న గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి బాధితుల నుంచి వివరాలు తెలుసుకుని, సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని కలెక్టర్ చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కోలూరు నుంచి మొగ్లి వరకు ఉన్న బిటీ రోడ్డు చెడిపోవడంతో గ్రామస్తులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావ్ పటేల్, సర్పంచ్ ఉష, మాజీ జెడ్పీటీసీ ఉత్తం బాలేరావ్, ఎంపీడీవో శ్రీధర్ పాల్గొన్నారు.


