మా గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే గుంతల రోడ్డే దిక్కు. రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో మాకు తెలుసు. పాత జీపుల్లో ప్రయాణించడం ప్రమాదమని తెలిసినా తప్పడం లేదు. బస్సులు సరిగా నడవవు.. ఆటోలు కూడా ఎప్పుడూ దొరకవు. పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే ఏ వాహనం దొరికితే అందులోనే వెళ్లాల్సిన పరిస్థితి.
– రాథోడ్ బిక్కు, సిరిపెల్లి
ప్రయాణం చేయక తప్పదు
ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసు. అయినా ప్రయాణం చేయక తప్పదు. ఆస్పత్రికి వెళ్లాలన్నా.. మార్కెట్‌కు వెళ్లాలన్నా.. ఇతర పనుల కోసం వెళ్లాలన్నా సరైన రవాణా సౌకర్యం లేదు. రోడ్లు బాగు చేసి బస్సులు నడిపితే పాత జీపుల్లో ప్రయాణం తప్పుతుంది. – జాదవ్ శివరామ్, రంజని


