● ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్ టౌన్: నేరాలపై నిర్ణీత గడువులో దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవా లని ఎస్పీ జానకీషర్మిల పోలీస్ అధికారులకు సూచించారు. డీజీపీ నిర్వహించిన రెండు రోజుల సమావేశాల్లో ఇచ్చిన ఆదేశాలు, సూచనలను క్షేత్రస్థాయి వరకు సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం నుంచి జిల్లా పోలీసు అధికారులతో మంగళవారం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 90, 60 రోజుల కాలపరిమితి గల బీఎన్‌ఎస్ కేసులతోపాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, కేసుల డిటెక్షన్, నిందితుల అరెస్టు, రికవరీ, పెట్రోలింగ్‌ను మరింత పటిష్టం చేయాలన్నారు. డయల్–112 కాల్స్‌కు వెంటనే స్పందించాలని ఆదేశించారు. దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్లు దాఖలు చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. సమావేశంలో భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీని వాస్, సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌వోలు, స్టేషన్ రైటర్లు, సీసీటీఎన్‌ఎస్ రైటర్లు, టెక్ టీమ్, బ్లూ కోల్ట్స్‌్, పెట్రోకార్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్
జిల్లా వ్యాప్తంగా ఈనెల ఒకటి నుంచి 30 వరకు పోలీస్ యాక్ట్ సెక్షన్ – 30 అమలులో ఉంటుందని ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీ లు, ఊరేగింపులు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా చర్యలకు పాల్పడినా, అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికల ద్వారా తప్పుడు ప్రచారం, వదంతులు, మత విద్వేషాలు లేదా సామాజిక ఉద్రిక్తతలకు దారి తీసే పోస్టులు, సందేశాలు, వీడియోలు ప్రసారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


