నిర్మల్‌చైన్‌గేట్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం ఓటర్ల జాబితాలో అదనపు ఓటర్ల మ్యాపింగ్ పూర్తిచేసే పనిలో నిమగ్నమైంది. అయితే జిల్లాలోని 2 పంచాయతీ డివిజన్ల పరిధిలోని 18 మండలాల్లో 18 జెడ్పీటీసీ, 157 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగ
నున్నాయి.
నూతన జాబితా ప్రామాణికంగా..
2025, జూలై 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని కలెక్టర్లకు జారీ చేసిన ఆదేశాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ జాబితాలో నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి, వాటిని సంబంధిత పంచాయతీ, పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలని ఆదేశించింది. వీటి ఆధారంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పరిధిలోని గ్రామ పంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలు రూపొందించాలని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) ధ్రువీకరణ అనంతరం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ సెంటర్లకు అనుసంధానించాలని పేర్కొంది. ఆ డేటాలో ఏవైనా తేడాలుంటే వాటిని ఈ నెల 23వ తేదీలోపు ఎన్నికల సంఘానికి నివేదించాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 23లోపు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. 23 తర్వాత అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను విడుదల చేసి, ఆ తర్వాత పోలింగ్ సెంటర్లు, బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు.
మే నెలలో ఎన్నికలు...
డిసెంబర్ నాటికి మండలాలవారీగా వివరాలు..
మండలం ఎంపీటీల పోలింగ్ మొత్తం ఓటర్లు
సంఖ్య కేంద్రాల సంఖ్య
దస్తురాబాద్ 5 24 12,894
కడెం 10 59 29,15
ఖానాపూర్ 8 48 23,657
పెంబి 5 32 10,886
మామడ 9 53 26,072
లక్ష్మణచాంద 9 49 24,577
నిర్మల్ రూరల్ 7 45 22,751
సారంగాపూర్ 14 77 39,516
సోన్ 8 43 21,801
దిలావర్‌పూర్ 6 34 18,744
నర్సాపూర్(జి) 7 38 20,238
లోకేశ్వరం 10 55 29,359
కుంటాల 7 35 19,055
భైంసా 11 67 33,970
ముధోల్ 10 53 28,754
తానూర్ 11 64 31,516
బాసర 6 31 15,728
కుభీర్ 14 86 40,625
పంచాయతీ డివిజన్లు 02
మొత్తం జెడ్పీటీసీలు 18
ఎంపీటీసీలు 157
పోలింగ్ కేంద్రాలు 892
వార్డులు 3,368
పురుష ఓటర్లు 2,13,805
సీ్త్రఓటర్లు 2,35,485
ఇతరులు 12
మొత్తం ఓటర్లు 4,49,302
ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు చివరిసారిగా 2019 మే 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. అదేరోజు ఫలితాలు ప్రకటించారు. జూన్‌లో ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్లను ఎన్నుకున్నారు. గతేడాది జూన్‌తో వారి పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోంది. వాస్తవానికి రెండు దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు గత సెప్టెంబరు 29న నోటిఫికేషన్ ఇవ్వగా నామినేషన్ల స్వీకరణ మొదలైంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అక్టోబరు 9న రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత హైకోర్టు అనుమతితో గ్రామ పంచాయతీ లు, పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. రిజర్వేషన్ల విధానాన్ని ప్రకటించిన తర్వాత దానికి అనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సైతం హైకోర్టు అనుమతితో మే నెలలో నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.


