
కమిషనర్ తీరును నిరసిస్తూ కౌన్సిలర్ రాజీనామా
ఖానాపూర్: పట్టణంలోని రోడ్డుపై జరుగుతు న్న ఆక్రమణలను మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆరో వార్డు కౌన్సి లర్ ఆఫ్రినాబేగం తన పదవికి రాజీనామా చే స్తున్నట్లు ప్రకటించారు. పట్టణంలోని మున్సి పల్ కార్యాలయంలో చైర్మన్ చిన్నం సత్యం స మక్షంలో కమిషనర్ మనోహర్‌కు రాజీనామా పత్రం అందజేశారు. పట్టణంలో జరుగుతున్న ఆక్రమణలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా క మిషనర్ క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని తెలిపారు. బీజేపీ నాయకులతో తనకు వివాదం సృష్టించా లని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రో డ్డు పై పెరుగుతున్న ఆక్రమణలను ఆపడంలో విఫ లమైన తీరును కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తన రా జీనామా ఆమోదించాలని కోరతానని తెలిపారు.