వారం రోజుల్లో అన్ని విషయాలు వెల్లడిస్తా: రాసలీలల మాజీ మంత్రి

Wont Join Congress Even If they Offer CM Post: Ramesh Jarkiholi - Sakshi

సాక్షి, బెంగళూరు: వారం రోజుల్లో తన రాజకీయ భవిష్యత్‌పై ఒక నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే రమేశ్‌ జార్కిహోళి అన్నారు. శుక్రవారం ఆయన మైసూరు నగరంలోని చాముండి కొండ వద్ద ఉన్న తప్పలిలోని సుత్తూరు శాఖ మఠానికి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్లుగా తాను కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నానని, అక్కడ తనకు సరైన ప్రాధాన్యత కల్పించలేదని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ వాళ్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా మళ్లీ ఆ పార్టీలోకి వెళ్ళనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ మునిగిపోయే బోట్‌ వంటిదని, అందులో చేరాలన్న ఆలోచన కూడా లేదన్నారు.

తాను రాజీనామా చేసినా బీజేపీలోనే ఉంటానని పేర్కొన్నారు. బీజేపీలో వచ్చిన తరువాత తనకు మంచి గుర్తింపు వచ్చిందని, అనంతరం జరిగిన పరిణామాలు తనను ఎంతో తీవ్రంగా కలిచివేశాయని, వారం రోజుల్లో అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. తనకు మళ్ళీ మంత్రి కావాలనే ఆసక్తి లేదని, తన రాజకీయ గురువు ఫడ్నవీస్‌ను కలవడానికి ముంబైకు వెళ్లింది నిజమేనని అన్నారు.  

చదవండి: మహారాష్ట్ర, కేరళ నుంచి వస్తే కరోనా పరీక్షలు తప్పనిసరి 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top