కీచక భర్త: రూ.10 లక్షలు ఇస్తేనే భార్యతో హనీమూన్‌.. అశ్లీల వీడియోలు తీసి..

UP Woman Accuses Husband Dowry Demand obscene video Honeymoon - Sakshi

ఉత్తర ప్రదేశ్‌లో ఓ కీచక భర్త నిర్వాకం వెలుగులోకి వచ్చింది. భార్యను హానీమూన్‌ తీసుకెళ్లడానికి అత్తింటి వారిని రూ. 10 లక్షలు డిమాండ్‌ చేశాడో ప్రబుద్ధుడు. వారు రూ.5లక్షలు అందజేయగా.. హనీమూన్‌లో భార్య అసభ్యకర వీడియోలు తీసి మరో రూ. 5 లక్షలు కావాలని, లేందంటే వీడియోలు వైరల్‌ చేస్తానని వారిని బెదిరించాడు.

వివరాలు.. పిలీభీత్‌కు చెందిన యువతికి  బుదౌన్‌లోని బిసౌలీ ప్రాంతానికి చెందిన వ్యక్తితో ఫిబ్రవరిలో వివాహమైంది. పెళ్లి తర్వాత తొలి రాత్రి జరుపుకోలేదు. అంతేగాక మూడు నెలలుగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. భర్త ప్రవర్తనపై బాధితురాలు తన అత్తకు చెప్పినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. దీంతో తనకు ఎందుకు దూరంగా ఉంటున్నావని, కారణం ఏంటని భార్య అతన్ని నిలదీసింది. తనకు 10 లక్షలు అదనంగా ఇవ్వాలని అత్తింటి వారిని డిమాండ్‌ చేశాడు. అలాగైతేనే భార్యను హనీమూన్‌కు తీసుకెళ్తానని తేల్చిచెప్పాడు.

కూతురు కాపురం బాగుండాలని కోరుకున్న వధువు తల్లితండ్రులు అల్లుడికి 5 లక్షలు అందించారు. దీంతో అతడు భార్యతో నైనిటాల్‌కు హానీమూన్‌కు వెళ్లాడు. అయితే అక్కడే అతడికి మరో వక్ర బుద్ధి కలిగింది. హానీమూన్‌లో భార్య అశ్లీల వీడియోలు రికార్డు చేశాడు. మరో రూ.5 లక్షలు ఇవ్వకుంటే వాటిని వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేసి వైరల్‌ చేస్తానని బెదిరించాడు.

భర్త చేష్టలతో విసిగిపోయిన భార్య పుట్టింటికి చేరుకొని తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. అనంతరం కొత్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో  భర్త, అత్తపై కేసు నమోదు చేసింది. కాగా ఇప్పటికే పెళ్లికి రూ.20 లక్షలు ఖర్చు చేశామని వధువు తల్లిదండ్రులు చెబుతున్నారు. అంతేగాక కూతురు అత్తమామలకు, ఆడపడుచులకు మరో రూ.15 లక్షల విలువైన నగలు బహుమతిగా ఇచ్చామని తెలిపారు. బాధితురాలి ఫఙర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: వైద్యుడి నిర్వాకం, భార్యను వదిలేసి యువతితో సంబంధం.. ఆస్పత్రి గోడ దూకి..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top