శాసనసభ ఎన్నికల బరిలోకి విజయ్‌?

Whether Hero Vijay Will Contest In The Assembly Elections In Tamilnadu - Sakshi

చెన్నై: రానున్న శాసనసభ ఎన్నికల బరిలోకి విజయ్‌ దిగనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో జరుగుతున్న చర్చ ఇదే. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు  ఉత్కంఠభరితంగా మారాయి. ఇలాంటి సమయంలో యువ నటుడు దళపతి విజయ్‌ రాజకీయ రంగప్రవేశానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తాజా సమాచారం. ఈ ఎన్నికల్లో విజయ్‌ పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో హల్‌చల్‌ చేస్తోంది. అందులో భాగంగా విజయ్‌ తండ్రి, ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఈయన కేంద్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో పార్టీ పేరును నమోదు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగా ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ న్యాయవాదితో సంప్రదించినట్లు తెలిసింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top