WhatsApp, Instagram, Facebook Server Down and Restored After 30 Min- Sakshi
Sakshi News home page

వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వర్లు కాసేపు డౌన్‌!

Mar 20 2021 4:59 AM | Updated on Mar 20 2021 1:36 PM

WhatsApp, Instagram, Facebook Messenger down - Sakshi

న్యూఢిల్లీ: వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ లాంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వేదికలు శుక్రవారం రాత్రి చాలాసేపు మొరాయించాయి. ఏదైనా సందేశం పంపాలన్నా, స్వీకరించాలన్నా సాధ్యం కాక నెటిజన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూస్‌ఫీడ్‌ను అప్‌డేట్‌ చేయలేకపోయారు. కొందరైతే తమ అకౌంట్లలో లాగిన్‌ కూడా కాలేకపోయారు.

ఎర్రర్‌ అనే సందేశం కనిపించడం చూసి తల పట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. సర్వర్‌ డౌన్‌ వల్లే ఆయా సైట్లు మొరాయించినట్లు సమాచారం. ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ ‘డౌన్‌ డిటెక్టర్‌’ గణాంకాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది మంది, వాట్సాప్‌పై 38 వేల మంది, ఫేస్‌బుక్‌పై 1,600 మంది ఫిర్యాదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement