వాట్సాప్‌ గ్రూపుల్లో అశ్లీల పోస్టులు.. అడ్మిన్‌ బాధ్యతపై హైకోర్టు కీలక ​వ్యాఖ్యలు

WhatsApp Group Admins Not Liable For Objectionable Posts By Members - Sakshi

తిరువనంతపురం: వాట్సాప్‌ గ్రూపుల్లో అభ్యంతరకర కంటెంట్‌ పోస్టులపై గ్రూపు అ‍డ్మిన్‌ బాధ్యత వహించడంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి పోస్టులకు అడ్మిన్‌ బాధ్యులు కాదంటూ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి కౌసర్‌ ఎడప్పగత్‌ తన తీర్పును వెలువరించారు. 

అ​యితే, మార్చి 2020లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన కేసు విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషనర్‌ ‘ఫ్రెండ్స్‌’ అనే వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేశాడు. ఈ గ్రూపులో అతడితో పాటు మరో ఇద్దరు అ‍డ్మిన్లు ఉండగా.. వారిలో ఒకరు గ్రూపులో అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్‌ చేశాడు. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 బి, పోక్సో చట్టంలోని సెక్షన్ 13, 14, 15 ఆధారంగా గ్రూప్ అడ్మిన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పిటిషనర్‌ గ్రూపును క్రియేట్‌ చేసినప్పటి నుంచి ఈ కేసులో ఏ2గా ఉన్నాడు. ఈ పోస్టు విషయంలో తనకు ప‍్రమేయం లేదంటూ అతను కోర్టును ఆశ్రయించాడు.

కాగా, ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా హైకోర్టు.. గ్రూప్‌లోని మెంబర్‌ పోస్ట్‌ చేసిన అభ్యంతకర పోస్టులకు గ్రూపు అడ్మిన్‌ బాధ్యులుకారని పేర్కొంది. అలా వారిని బాధ్యులుగా పరిగణించడం క్రిమినల్‌ చట‍్టంలోని ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమంటూ కోర్టు పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top