Viral Video: ఖవాల్‌జీత్‌ చేసిన పనికి నెటిజన్లు ఫిదా

viral video: Man Buys Entire Fruit Stock From Elderly Woman - Sakshi

ప్రస్తుతం కూరగాయలు, పండ్లు కోనుగోలు చేయడానికి జనాలు సూపర్‌ మార్కెట్లు, డెలివరీ యాప్స్‌ను వాడుతున్నారు. అక్కడక్కడా రోడ్డుపై బండ్లు పెట్టుకొని అమ్మెవారి వద్ద కూడా కొనుకున్నా.. కొంతమేరకు తగ్గిందనే చెప్పాలి!. అయితే తాజాగా ఓ వ్యక్తి చేసిన పనికి సోషల్‌మీడియాలో పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఆయన చేసిన ఏంటని అనుకుంటున్నా?. 

పంజాబ్‌లోని లూథియాకు చెందిన ఖవాల్‌జీత్‌ సింగ్‌ పండ్లు కొందామని రోడ్డు పక్కన ఓ వృద్దురాలి పండ్ల బండి వద్దకు వెళ్లాడు. 62 ఏళ్లు ఉ‍న్న ఆ వృద్దురాలతో వద్ద పండ్లు కొనుగోలు చేస్తూ ఆమె వ్యాపారం గురించి అడిగి తెలుకున్నాడు. 12 గంటలు కష్టపడి పండ్లు అమ్మినా తన వద్ద పండ్లు ఎవరూ కొనడంలేదని ఆమె వాపోయింది. దీంతో ఖవాల్‌జీత్‌.. ఆమె బండిపై ఉన్న సుమారు రూ.3000 విలువగల అన్ని పండ్లను ఒకేసారి కొన్నాడు.

‘నేను పండ్లు కొనడాకి వెళ్లినప్పుడు.. వాటిని అమ్మె వృద్దురాలు  ధీనంగా కూర్చుని ఉంది. ముందు రోజు కూడా పండ్లు అమ్ముడుపోలేదని తెలిపింది. ఇప్పటి వరకు కేవలం రూ.100 పండ్లు  మాత్రమే అమ్ముడుపోయినట్ల చెప్పింది. అందుకే మొత్తం బండిపై ఉ‍న్న పండ్లు కొనుగోలు చేశాను’ అని ఖవాల్‌జీత్‌ తెలిపారు. దీనికి సంబధించిన వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ​ పోస్ట్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏడుపు ఆగలేదు’, ‘చాలా మంచి పని చేశారు సర్దార్‌జీ’ అని కామెట్లు చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top