Viral Video: సెల్ఫీ ఆనందంలో సెల్‌నే విసిరి ఆ తర్వాత...:

Viral Video: Fish Back Into The Water Man Flinged His Phone - Sakshi

స్మార్ట్‌ఫోన్‌లు ప్రజల జీవితంలో ఎంత పెద్ధ స్థానాన్ని ఆక్రమించాయో చెప్పనవసరం లేదు. ఫోన్‌ లేకపోతే మనుగడే లేదన్నంతగా వాటిపై ఆధారపడిపోయాడు. అంతేగాదు ఆ స్మార్ట్‌ఫోన్‌లతో ఏ చిన్న ఆనందాన్నైనా సెల్ఫీ అంటూ....వీడియోల్లో బంధించి ముచ్చటపడిపోతుంటాం. ఇటీవల కాలంలో ఈ సెల్ఫీల క్రేజ్‌ జనాల్లో మాములుగా లేదు. ఎంతలా ఉందంటే ప్రాణాంతకమైన ప్రదేశాల్లో సైతం సెల్ఫీలు దిగి ప్రాణాలు పైకి తెచ్చుకుంటున్నావారు కొందరైతే. మరికొందరూ సెల్ఫీ ఆనందంలో ఏం చేస్తున్నారో మరిచిపోయి విలువైన వస్తువులను పొగొట్టుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి కూడా సెల్ఫీ తీసకుంటూ ఆ ఆనందంలో ఫోన్‌ని విసిరేసి...అబ్బా! అంటూ తలపట్టుకున్నాడు.

అసలేం జరిగిందంటే...ఒక వ్యక్తి సరదాగా సముద్రంలో బోట్‌తో షికారు కొడుతుంటాడు. అతను బోట్‌లో నుంచుని ఒక చేతితో చేపను పట్టుకుని సెల్పీలు తీసుకుంటాడు. రకరకాల యాంగిల్స్‌లో.. వివిధ ఫోజులలో ఫోటోలు తీసుకున్నాడు. ఆ సెల్పీ ఆనందం అయిపోగానే చేపను పడవేయబోయి పొరపాటున ఫోన్‌ని సముద్రంలో విసిరేస్తాడు. దీంతో పాపం ఆ వ్యక్తి ఫోన్‌ని ఎలాగైనా పట్టుకోవాలని బోట్‌ వద్దకు వచ్చి వంగి తెగ ప్రయత్నిస్తాడు కూడా. కానీ దురదృష్టం అప్పటికే జరగాల్సినదంతా జరిగిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగవైరల్‌ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి

(చదవండి: శాస్త్రవేత్తలను సైతం కలవరపాటుకు గురిచేసిన విచిత్ర జీవి: వీడియో వైరల్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top