ముర్ముకు ఉపరాష్ట్రపతి వెంకయ్య అభినందనలు | Vice President M Venkaiah Naidu meets New President Droupadi Murmu | Sakshi
Sakshi News home page

ముర్ముకు ఉపరాష్ట్రపతి వెంకయ్య అభినందనలు

Jul 23 2022 4:13 AM | Updated on Jul 23 2022 4:13 AM

Vice President M Venkaiah Naidu meets New President Droupadi Murmu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం  ఢిల్లీలోని ముర్ము తాత్కాలిక నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసిన వెంకయ్య నాయుడు 15 నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, జి.కిషన్‌ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు, మత నాయకులు, బ్రహ్మ కుమారీస్‌ నిర్వాహకులు కూడా ముర్మును కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముర్ము నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement