breaking news
venkaiaha naidu
-
ముర్ముకు ఉపరాష్ట్రపతి వెంకయ్య అభినందనలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని ముర్ము తాత్కాలిక నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసిన వెంకయ్య నాయుడు 15 నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, జి.కిషన్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు, మత నాయకులు, బ్రహ్మ కుమారీస్ నిర్వాహకులు కూడా ముర్మును కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముర్ము నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. -
ఎంపీల సస్పెన్షన్: సమావేశాలు బహిష్కరణ
ఢిల్లీ : రాజ్యసభలో 8 మంది సభ్యుల పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తి వేసేవరకు రాజ్యసభ సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నామని ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ మంగళవారం పేర్కొన్నారు. సభ్యులపై సస్పెన్షన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన సభ నుంచి వాకౌట్ చేశారు. ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ , తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యులు కూడా సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. 8 మంది సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తి వేసేవరకు రాజ్యసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ బిల్లులపై పునరాలోచించేవరకు సభలోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు.మరోవైపు సభ్యుల సస్పెన్షన్ పై తాను సంతోషంగా లేనని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. ఎంపీల ప్రవర్తన కారణంగానే చర్యలు తీసుకున్నామని.. ఏ సభ్యుడిపై కూడా వ్యతిరేకంగా వ్యవహరించడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. (చదవండి : 8 మంది ఎంపీల సస్పెన్షన్) కాగా వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం పలువురు విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి, డెప్యూటీ చైర్మన్ హరివంశ్‌తో అనుచితంగా ప్రవర్తించడం తెల్సిందే. బిల్లులను సభాసంఘానికి పంపించాలన్న తీర్మానంపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో ఆయన ముఖంపై రూల్ బుక్‌ను విసిరేయడం తెలిసిందే. అయితే రాజ్యసభలో ఈ అంశంపై రగడ సోమవారం కూడా కొనసాగింది. దీంతో సభా మర్యాదలకు భంగం కలిగించిన 8 మంది విపక్ష సభ్యులను సోమవారం సస్పెండ్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్, ఆప్ సభ్యులు సంజయ్ సింగ్, డోలాసేన్, కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ సత్వ, సయ్యద్ నాజిర్ హుస్సేన్, రిపున్ బోరా, సీపీఎం సభ్యులు కేకే రాగేశ్, ఎలమారమ్ కరీన్‌లను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు, హరివంశ్‌పై విపక్షపార్టీలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును చైర్మన్ వెంకయ్య నాయుడు తోసిపుచ్చారు. (చదవండి : ఎంపీల నిరసన : ఢిల్లీ పోలీసుల ఓవర్ యాక్షన్) -
హరికృష్ణకు కన్నీటి వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ అంత్య క్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛ నాలతో జరిగాయి. కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు హరి కృష్ణకు కడసారి కన్నీటి నివాళులర్పించారు. హరికృష్ణ తనయులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు అంతిమ సంస్కారాలు నిర్వహిం చారు. చితికి కల్యాణ్‌రామ్ నిప్పంటించారు. పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. హరికృష్ణ చివరి చూపు కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. నివాళులర్పించిన రాజకీయ, సినీ ప్రముఖులు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జస్టిస్ చలమేశ్వర్, మంత్రులు కేటీఆర్, మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, ఎంపీలు కవిత, డి.శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నేతలు మేకపాటి రాజమెహన్రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, ప్రసన్న కుమార్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సురేశ్‌రెడ్డి, రేణుకాచౌదరి, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగల, సీఎం రమేశ్, నన్నపనేని రాజకుమారి, మాగంటి బాబు, యార్గగడ్డ లక్ష్మీప్రసాద్, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు, నటులు నాగార్జున, కోటా శ్రీనివాసరావు, జగపతి బాబు, అర్జున్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ఆలీ, బెనర్జీ, మంచు లక్ష్మి, మనోజ్ తదితరులు హరికృష్ణ నివాసానికి చేరుకుని, ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. హరికృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులకు, అభిమానులకు మధ్య తోపులాట అభిమాన నాయకుడిని కడసారి చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తెల్లవారుజామున వచ్చిన వారిని ఉదయం 11 గంటల తర్వాత కూడా లోనికి అనుమతించకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీ సులకు, అభిమానులకు మధ్య స్వల్ప తోపు లాట చోటు చేసుకుంది. పోలీసులు చివరకు వీఐపీలకు, అభిమానులకు ప్రత్యేక దారులను ఏర్పాటు చేసి, భౌతికకాయం సందర్శనార్థం అనుమతించడంతో వారు శాంతించారు. అభిమాన నేతకు కడసారి వీడ్కోలు పలికేం దుకు ఎన్‌ఎండీసీలోని హరికృష్ణ నివాసానికి అభిమానులు పెద్ద మొత్తంలో చేరుకోవడంతో మాసబ్‌ట్యాంక్ మొదలు మెహిదీపట్నం వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటన్నరపాటు సాగిన అంతిమ యాత్ర హాలులో ఉన్న హరికృష్ణ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల తర్వాత పోర్టికోలోకి తీసుకొచ్చారు. అక్కడే కుమారులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో బ్రాహ్మణులు సంప్రదాయ పద్ధతిలో పూజలు చేయించారు. అనంతరం అశ్రునయనాల మధ్య హరికృష్ణ అంతిమ యాత్ర సాగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ స్వయంగా పాడెను మోసుకుంటూ వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైకుంఠరథంలో ఎక్కించారు. ‘నందమూరి హరికృష్ణ అమర్ రహే..’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేసుకుంటూ అభి మానులు ముందుకు సాగారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్‌ఎండీసీలోని హరికృష్ణ స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర సరోజినీదేవి కంటి ఆస్పత్రి, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్‌సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్, జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మధ్యాహ్నం 3.30 గంటలకు మహా ప్రస్థానానికి చేరుకుంది. దాదాపు గంటన్నర పాటు అంతిమయాత్ర సాగింది. తండ్రికి తగ్గ తనయుడు: వెంకయ్య సాక్షి, హైదరాబాద్: ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో తెలుగు లోనే మాట్లాడతానని హరికృష్ణ పట్టుబట్టారు. ఆ సమయంలో నేను జోక్యం చోసు కుని తెలుగును ఇంగ్లిష్‌లోకి అనువాదం చేస్తానని అప్పటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్‌కు చెప్పాను’అనే విషయాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. గురువారం హరికృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. తండ్రికి తగ్గ తనయుడిగా హరికృష్ణ బతికారని కొనియాడారు. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేశారని వ్యాఖ్యానించారు. అనుకున్న పనిని తనదైన శైలిలో చేసిన వ్యక్తి హరికృష్ణని అన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ తనయుడిగా హరికృష్ణ వ్యవహరించారని పేర్కొన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనా లతో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించిం ది. అంతిమయాత్ర మహాప్రస్థానానికి చేరు కున్న తర్వాత వైకుంఠరథం నుంచి భౌతిక కాయాన్ని కిందికి దింపారు. కుమారులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ముందు నడుస్తుండగా ఆ వెనుకాలే చంద్రబాబు, జస్టిస్ చలమేశ్వర్, హరికృష్ణ సోదరుడు బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులంతా పాడెపట్టి భౌతిక కాయాన్ని చితివరకు మోసుకొచ్చారు. పోలీ సులు హరికృష్ణ భౌతికకాయానికి గౌరవ వంద నం చేసి.. గాల్లోకి మూడు సార్లు కాల్పులు జరిపారు. సరిగ్గా 4.10 గంటలకు కల్యాణ్ రామ్ హరికృష్ణ చితికి నిప్పంటించారు. -
నేడు నల్సార్‌కు ఉపరాష్ట్రపతి
హైదరాబాద్: శామీర్‌పేట్ మండల కేంద్రంలోని నల్సార్ లా వర్సిటీ వేదికగా సెప్టెంబర్ 3 నుంచి 10 వరకు అంతర్జాతీయ న్యాయసంస్థ 78వ సమావేశాలు నిర్వహించనున్నట్లు నల్సార్ లా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి శనివారం తెలిపారు. ఆదివారం సాయంత్రం నిర్వహించే సమావేశం ప్రారంభోత్సవాలకు ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో పాటు పలువురు ప్రముఖులు హజరవుతారన్నారు. -
'వెంకయ్యనాయుడు.. మద్దతు ఇవ్వండి'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు లేక రాశారు. విభజన సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన, చట్టంలో పొందుపరిచిన రాయితీలను కేంద్రం అమలు చేయడం లేదని విమర్శించారు. దీంతో పునర్విభజన చట్టానికి కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ గతేడాది జూలైలో రాజ్యసభలో తాను ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. గత నెల 29న ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అవసరంలేదనే అభిప్రాయం వచ్చేలా కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి మాట్లాడారని గుర్తుచేశారు. దీంతో తాము ఓటింగ్‌కు పట్టుబడుతున్నట్టు కేవీపీ తెలిపారు. ఈ నెల 13న రాజ్యసభలో చర్చకు వచ్చినపుడు, సవరణల విషయంపై తాము ప్రవేశపెట్టిన బిల్లుకు ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలన్ని మద్దతు తెలిపేలా కృషి చేయాలని కేవీపీ, వెంకయ్యనాయుడును కోరారు. ఈ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాలా ఉపయోగపడుతుందని తెలియజేశారు.