VP Venkaiah Naidu Ask Funny Question To MP Suresh Gopi: Mask Or Beard - Sakshi
Sakshi News home page

VS Venkaiah Naidu: ఎంపీ సురేష్ గోపీ లుక్.. అది మాస్క్‌? గడ్డమా? అంటూ వెంకయ్య జోకులు

Mar 28 2022 1:58 PM | Updated on Mar 28 2022 3:13 PM

Vice President Ask Suresh Gopi Wearing Mask Or Snow Beard - Sakshi

న్యూఢిల్లీ: ఒక్కోసారి రాజకీయ నాయకులు రాజకీయం పరంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ఛలోక్తులు విసురుకోవడం సహజం. నిజానికి ఆ సెటైర్లు భలే నవ్వుతెప్పించే విధంగానే ఉంటాయి. అవతలి ప్రతిపక్షం నాయకులు కూడా స్పోర్టీవ్‌గానే తీసుకుని రివర్స్‌ పంచ్‌లు వేస్తుంటారు కూడా. అచ్చం అలాంటి సంఘటన రాజ్యసభలోలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...రాజ్యసభలో జరుగుతున్న సమావేశంలో బీజేపీ ఎంపీ సురేష్‌ గోపీ వంతు రాగానే ఆయన లేచి నిలబడి మాట్లాడుతున్నారు. ఆయన మళయాళం నటుడు కూడా. అయితే ఆయన సమావేశంలో లేచి నిలబడి తన గురించి చెబుతుండగా ఇంతలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ప్రసంగంలో జోక్యం చేసుకున్నారు. ‘‘సార్‌ ఏంటిది? గడ్డమా? లేక మాస్క్‌? నాకు అర్థకావడం లేదు అంటూ వెంకయ్య చమత్కరించారు. దీంతో సభలో ఒక్కసారిగి నవ్వులు విరిశాయి.

అయితే ఎంపీ సురేష్‌ ఇది గడ్డమే తన తదుపరి సినిమా కోసం ఇలా పెంచానని వివరణ ఇచ్చారు. తర్వాత ఆయన ప్రసంగం కొనసాగించమని వెంకయ్యనాయుడు అన్నారు. 

(చదవండి: మూడేళ్లుగా సేకరిచిన రూపాయి నాణేలతో డ్రీమ్‌ బైక్‌...)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement