జనవరి 12 నుంచి నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌

Union Minister Mansukh Mandaviya keynote address on NEET PG Counseling - Sakshi

న్యూఢిల్లీ: ఈనెల 12 నుంచి నీట్‌– పీజీ కౌన్సెలింగ్‌ ఆరంభమవుతుందని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. 2021–22 సంవత్సరానికి కౌన్సెలింగ్‌ నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ నెల 7న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కౌన్సెలింగ్‌లో 27 శాతం ఓబీసీ, 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటాను సుప్రీం సమర్ధించింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా కౌన్సెలింగ్‌ చేపట్టేందుకు సిద్ధమైనట్లు మంత్రి తెలిపారు.  గతేడాది సెప్టెంబర్‌లో నీట్‌ పీజీ పరీక్ష జరిగింది. అదేనెల్లో ఫలితాలు ప్రకటించారు. సుమారు 45వేల మెడికల్‌ పీజీ సీట్లను కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్‌ను త్వరగా చేపట్టాలని గతనెల్లో దేశవ్యాప్తంగా రెసిడెంట్‌ డాక్టర్లు ఆందోళన చేపట్టారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top