తెలుగు రాష్ట్రాలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన అమిత్‌షా | Tribal Museums To Be Established in AP And Telangana Confirms Central Minister Amit Shah | Sakshi
Sakshi News home page

Amit Shah: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన అమిత్‌షా

Nov 23 2021 3:02 AM | Updated on Nov 23 2021 11:13 AM

Tribal Museums To Be Established in AP And Telangana Confirms Central Minister Amit Shah - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ తెలంగాణల్లోనూ గిరిజన మ్యూజియాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. సోమవారం మణిపూర్‌లో రాణిగైడిన్లు గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంకు వర్చువల్‌ ద్వారా అమిత్‌ షా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన మ్యూజియాలకు రూ.195 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్‌లకు రూ.110 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement