ఒడిశా: ప్రమాద స్థలంలో ఇంకా మృతదేహాలు ఉన్నాయా?

train accident balasore bahanaga foul smell - Sakshi

ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన స్థలం దగ్గర విపరీతమైన దుర్వాసనలు వెలువడుతున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసిన స్థానికులు అక్కడ ఇంకా మృతదేహాలు ఉన్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందగానే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దుర్వాసన రావడానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. 

భువనేశ్వర్‌ అది ఒడిశాలోని బాలాసోర్‌ పరిధిలోని బహనాగా బాజార్‌ రైల్వే స్టేషన్‌. వారం రోజుల క్రితం (జూన్‌ 2)న ఈ స్టేషన్‌ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 288 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఈ ఘటన జరిగిన 7 రోజులు గడిచినా ఇప్పటికీ బహనాగా బాజార్‌ ప్రజలు ప్రమాద దృశ్యాలను మరువలేకపోతున్నారు.

బహనాగా బాజార్‌ ప్రాంతంలో ఉంటున్నవారు చెబుతున్న దానిప్రకారం సంఘటనా స్థలంలో ఇంకా మృతదేహాలు ఉండే అవకాశం ఉంది. అటువైపు వెళుతున్నప్పుడు దుర్వాసన వెలువడుతోందని వారు చెబుతున్నారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తిన దరిమిలా రైల్వే అధికారులు సంఘటనా స్థలంలో తనిఖీలు చేపట్టగా, ఒక్క మృతదేహం కూడా లభ్యం కాలేదు. 

ఘటనా స్థలంలో రెండు సార్లు పరిశీలనలు
సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే సీపీఆర్‌ఓ ఆదిత్య కుమార్‌ చౌదరి మాట్లాడుతూ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సంఘటనా స్థలంలో రెండుసార్లు పరిశీలనలు జరిపిందని, ఆ తరువాతనే సైట్‌ క్లియరెన్స్‌ ఇచ్చిందని తెలిపారు. ఇది జరిగిన తరువాత కూడా స్థానికుల ఫిర్యాదుతో రాష్ట్రప్రభుత్వ అధికారుల బృందం సంఘటనా స్థలంలో పరిశీలనలు జరిపిందన్నారు. అయితే స​ంఘటనా స్థలంలోవున్న గుడ్ల కారణంగానే ఈ విధమైన దుర్వాసన వస్తున్నదన్నారు. 

ఇది కూడా చదవండి: దేశానికి మరో ముప్పు ఉంది

దుర్ఘటన సమయంలో 4 టన్నుల గుడ్ల రవాణా
రైల్వే సీపీఆర్‌ఓ తెలిపిన వివరాల ప్రకారం యశ్వత్‌పూర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్‌లో సుమారు 4 టన్నుల గుడ్లు లోడ్‌ చేశారు. ప్రమాద సమయంలో ఆ గుడ్లన్నీ పగిలిపోయాయి. ఈ ఘటన జరిగి ఏడు రోజులు కావడంతో ఆ గుడ్లన్నీ విపరీతంగా కుళ్లిపోయాయి. అందుకే ఇప్పుడు ఆ ప్రాంతంలో విపరీతమైన దుర్వాసన వస్తున్నదన్నారు. ఈ గుడ్ల చెత్తను తొలగించేందుకు బాలాసోర్‌ మున్సిపల్‌ సిబ్బంది సహాయం తీసుకుంటున్నామన్నారు. 

ఇది కూడా చదవండి: మృతదేహాలను ఉంచిన స్కూల్‌ కూల్చివేత

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top